రైతులకు నిరుపయోగంగా మారిన రైతు వేదికలు

Oct 7, 2024 - 19:36
 0  2
రైతులకు నిరుపయోగంగా మారిన రైతు వేదికలు

తుంగతుర్తి అక్టోబర్ 7 తెలంగాణ వార్త ప్రతినిధి:- వేల కోట్ల రూపాయలు రైతు వేదికల పేరిట దుర్వినియోగ పాలు...... తెలంగాణ రాష్ట్రం లోని గత  బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలు రైతులకు ఏమాత్రం ఉపయోగ దాయకంగా లేవు. ఈ రైతు వేదిక ల నిర్మాణానికి గత ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించినా కానీ నిరుపయోగంగా ఉన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా తుంగతుర్తి లోని రైతు వేదికలో ప్రతిరోజు మేకలు , పశువులు ఇతర మూగ జీవాలకు ఆవాసంగా మారింది. కొన్ని రైతు వేదికలు అసంపూర్తి నిర్మాణాలతో సరైన ఫర్నిచర్ లేక చాలా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉన్నది. తుంగతుర్తి లోని రైతు వేదిక చుట్టూ కాంపౌండ్ వాల్ , గేటు లేక రాత్రి సమయాలలో కొంతమంది ఆకతాయిలు మద్యం బాటిళ్లు స్వీకరించే పరిస్థితి కనిపిస్తుంది. అందువలన ఈ రైతు వేదికలో ఎక్కడ చూసినా చుట్టూ మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయి. కొత్తగా నిర్మించిన లైట్లు సీలింగ్ ఫ్యాన్లను కూడా కొంతమంది దొంగిలించారని రైతులు వాపోతున్నారు. కావున ప్రస్తుత ప్రభుత్వం అయినా తగిన చర్య తీసుకుని ఈ రైతు వేదికలు రైతులకు ఉపయోగపడే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333