మిస్టర్ మరియు మిస్ రేడియన్స్ లుక్ ఆఫ్ తెలంగాణ 2025 – ఘన విజయంతో ముగిసిన అందాల పోటీ
హైదరాబాద్: మిస్టర్ మరియు మిస్ రేడియన్స్ లుక్ ఆఫ్ తెలంగాణ 2025” ఈవెంట్ ఏప్రిల్ 20వ తేది, ఆదివారం సాయంత్రం ఓపెన్ గ్రౌండ్, సరథి స్టూడియోస్, అమీర్‌పేట్, హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో తెలుగు రాష్ట్రాల నుండి మిస్టర్, మిస్ మరియు మిసెస్ కేటగిరీలలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీకి సినీ నటులు కూడా హాజరయ్యారు.
ఈ అందాల పోటీలను ఆర్గనైజర్ & డైరెక్టర్ నిహాసిని వర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప గౌరవం. తెలంగాణలో తొలిసారిగా ఈ స్థాయిలో నిర్వహించబడిన ఈవెంట్, ఈ రంగంలో ఒక కొత్త మైలురాయిగా నిలిచింది.
ఈవెంట్ విజయవంతంగా జరగడానికి సహాయపడిన కెమెరా టీమ్ విజయ్ సినిమాటోగ్రఫీ, స్పాన్సర్లు, గౌరవ అతిథులు, Monty's టీమ్, జ్యూరీలు – జాక్లిన్, హర్షద్, నీలిమా, హినా తజ్, ఫ్యాషన్ కోరియోగ్రాఫర్ అతుల్ సురేష్ గారు మరియు వారి టీమ్, షో డైరెక్టర్లు సందీప్, సోను, మీడియా టీమ్ Ashok గారు వంటి అందరికీ ఆర్గనైజర్ నిహాసిని వర్మ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఈవెంట్ లో ప్రపంచంలోనే తొలిసారి ఒక బ్యూటీ పేజెంట్ కోసం ప్రత్యేకంగా రచించబడిన "Radiance War" పాటను ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ తో కలిసి రూపొందించారు. ఈ పాటను టాలీవుడ్ డైరెక్టర్ లంకలపల్లి గారు ప్రత్యేక అతిథిగా హాజరై లాంచ్ చేశారు. ఈ వీడియో సాంగ్ బ్యూటీ పేజెంట్ చరిత్రలో ఒక కొత్త దిశను చూపిస్తూ, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఈవెంట్‌కు టైటిల్ స్పాన్సర్లు గా ప్రోసిఫ్ ప్రాపర్టీ అడ్వైజర్ చైర్మన్ డా. ఉల్లిబాద్ర నరేష్ బాబు గారు, శ్రీ సాయి మణికంఠ బ్రిక్స్ అండ్ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ ఫణీంద్ర గుప్తా గారు వ్యవహరించారు. అలాగే కో-స్పాన్సర్లు గా విక్రమ్ ట్రావెల్స్, ప్రజ్ఞా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ వారు మరియు సపోర్టెడ్ స్పాన్సర్లు గా X Lounge, Grease Monkey, Infinity Cafe గారు ఈ ఈవెంట్ కు బలమైన మద్దతునిచ్చారు.
మొదటి సారి ఒక యువతి ఇటువంటి స్థాయిలో ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడం చిన్న విషయం కాదు. నిహాసిని వర్మ గారు "నారీ శక్తి" అంటే ఏంటో మరోసారి నిరూపించారు. ఈవెంట్ SkyLn ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అత్యంత సమర్థవంతంగా నిర్వహించబడింది.
త్వరలోనే ఒక “సక్సెస్ మీట్” ఏర్పాటు చేసి, విజేతల కోసం మీడియా సమక్షంలో మరోసారి “క్రౌనింగ్ సెరిమనీ” నిర్వహించనున్నట్టు ఆర్గనైజర్ నిహాసిని వర్మ గారు తెలిపారు.