ఎన్.పి.ఆర్.డి జాతీయ సదస్సును జయప్రదం చేయండి
మోత్కూరు 17 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మోత్కూర్ మండలం మోత్కూర్ టౌన్ బుజలాపురం పాలడుగు గ్రామాలలో ఎన్.పి ఆర్.డి గ్రామకమిటీల సమావేశం సందర్భంగా ఎన్. పి.ఆర్.డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..ఈనెల 25,26 న హైదరాబాద్ కేంద్రంలో జాతీయ సదస్సు ను మన జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు విద్య వైద్య ఉపాధి అవకాశాలు కల్పించాలి!వికలాంగులకు ఈ జిల్లాలో చదువుకుందామంటె (21)రకాల వైకల్యం ఉన్న మండల కేంద్రాల్లో చదువుకుందామంటే స్కూల్ లేకపోవడం వల్ల వికలాంగులు ఇబ్బందిపడుతున్నారు.అందుకోసం ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో అన్ని రకాల వైకల్యం వాళ్లకు చదువుకోవడానికి స్కూల్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా వికలాంగుల కుటుంబాల పిల్లలకు చదువుకు సంబంధించిన అన్ని రకాల బాధ్యత ప్రభుత్వమే భరించాలని డిమాండ్ వికలాంగుల వైద్యం రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద ప్రైవేటు హాస్పిటల్లో వికలాంగులకు ఉచితంగానే గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయాలని అన్ని రకాల వైద్యం కల్పించాలని ఎందుకంటే వికలాంగులు చాలామంది అనారోగ్యం కారణం వల్ల కిడ్నీల బారిన పడి.గుండె జబ్బులతో హాస్పటల్లో చూపెట్టుకోలేక వికలాంగులు చాలామంది చనిపోవడం జరుగుతుంది.కావున ఈ బాధ్యత గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలని అన్ని రకాల హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందిచాలని బాధ్యత ప్రభుత్వమే భరించాలని డిమాండ్ వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వికలాంగులకు చిన్నచిన్న వ్యాపారం చేసుకోవడానికి అదేవిధంగా బస్టాండ్లో షాపింగ్ కాంప్లెక్స్ లాంటి జిల్లావ్యాప్తంగా ఉపాధి కల్పించాలని ప్రతి వికలాంగునికి ఉపాధి కోసం బ్యాంకు ద్వారా ఎలాంటి చర్తులు లేకుండా 100% సబ్సిడీతో పది లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6వేల రూపాయలు పెన్షన్ తోపాటు స్థానిక సంస్థల్లో నామిటెడ్ పోస్టులు అమలు చేయాలని వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వికలాంగుల కుటుంబాలకు 300 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని వికలాంగులకు అంథోదయ రేషన్ కార్డు 35కిలో బియ్యం ఇవ్వాలని ఉపాధి హామీ పథకంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాళ్ళ వికలాంగులకు ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని వికలాంగుల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 5016 ఇవ్వాలని వికలాంగులకు చదువుకుని ఉన్న నిరుద్యోగులకు బ్లాక్ లాంగ్ పోస్టులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్.పి.ఆర్.డి డివిజన్ అధ్యక్షులు గడ్డం యాదగిరి, మోత్కూర్ టౌన్ అధ్యక్షులు గుండు శ్రీను,ఉపాధ్యక్షురాలు వస్తుప్పల మంజుల కార్యదర్శి పల్లపు సమ్మయ్య సహాయక కార్యదర్శి అప్పల యాదగిరి, కోశాధికారి గౌలికార్ రాజు బుజిలాపురం గ్రామ అధ్యక్షులు చేతరాష్ నరేష్ ఉపాధ్యక్షులు రాపాల సత్తయ్య,కార్యదర్శి వేముల వెంకన్న,సహాయక కార్యదర్శి కే నరేష్ కోశాధికారి ఎస్.కె జులేఖ పాలడుగు గ్రామ అధ్యక్షురాలు బండి అండాలు, ఉపాధ్యక్షులు దొడ్డిపల్లి వెంకటయ్య కార్యదర్శి కొంపెల్లి జాంగిర్,సహాయక కార్యదర్శి బొంతల కిష్టయ్య, కోశాధికారి కొప్పుల లలిత, సీనయ్య,శర్మ తదితరులు పాల్గొన్నారు.