**గిరిజన హాస్టల్ వర్కర్ల నోటి కాడ బువ్వ గుంజుకున్నా ప్రభుత్వం""ఇదేమిటనే అడిగితే అరెస్టు లా*

*గిరిజన హాస్టల్ వర్కర్ల నోటికాడ బువ్వ గుంజుకున్న ప్రభుత్వం*
*ఇదేమిటని అడిగితే అరెస్టు లా*
పెరుమాళ్ళ పల్లి మోహన్ రావు.రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్న.
తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ*****ఖమ్మం. రూరల్.19అక్టోబర్.
గిరిజన సంక్షేమం హాస్టల్ లో వంట చేస్తున్న వర్కర్స్ కు ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న
జీతాలను తగ్గించిన ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్త న
నిరవధిక సమ్మె చేస్తున్నారు. 37 రోజులైనా సమస్యను పరిష్కరించక పోగా మంత్రి గారి కి చెప్పుకోడానికి వచ్చిన కార్మికులను అరెస్టులు చేస్తారా ? అని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సహాయ కార్యదర్శి పెరుమాళ్ళపల్లి మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ డైలివేజు వర్కర్స్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో మంత్రులు ఇండ్ల ముట్టడి కార్యక్రమం లో బాగంగా ఖమ్మం లో మంత్రులు ఇండ్ల ముట్టడి సందర్భంగా భద్రాచలం కరకగూడెం ఆళ్ళపల్ల గుండాల ఇల్లందు ఏడుగురాళ్ళ పల్లి పాల్వంచ మండలాలకు చెందిన వంట చేస్తున్న వర్కర్స్ ను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి తీసుకువచ్చారు.
వారిని పరమార్శించి వ్యక్తి గత పూచికతొ విడిపించారు.
ఈ సందర్భంగా పి.మోహన్ రావు మాట్లాడుతూ
*జీతాలు పెంచుతారు గానీ కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది ?*
ఏ ప్రభుత్వమైనా కష్టం చేస్తున్న కార్మికుల జీతాలు పెంచుతుంది. లేదంటే ఉన్న జీతాలన్ని కొనసాగిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 26,800 వస్తున్న జీతాన్ని రూ.11,700/-లు తగ్గించింది. ఔట్సోర్సింగ్ వర్కర్లకు రూ.15,600/-లు, డైలీవేజ్ వర్కర్లకు రావలసిన జీతాన్ని రూ.9,200/-లు మాత్రమే ఇస్తుంది. రోజు తెల్లవారుఝామున 4-00 గంటల నుండి రాత్రి 8-00 గంటల వరకు అంటే 14 నుండి 15 గంటలు పని చేస్తున్నారు. గత 29 సం||లుగా జిల్లా కలెక్టర్ కనీస వేతనాల ప్రకారం డైలీవేజ్ వర్కర్లకు జీతాలను ట్రెజరీ ద్వారా 020 పద్దు కింద జీతాలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ నెం.64 తెచ్చి జిల్లా కలెక్టర్ గెజిట్ చెల్లుబాటు కాదు, ఆర్థిక శాఖలో డైలీవేజ్ అనే పదమే లేదు. కాబట్టి వర్కర్ల జీతాలను రూ.11,700/-లు తగ్గిస్తున్నామని చెప్పారు. డైలీవేజ్ అనే పదం లేకుండా 30 సం॥లకు పైగా ఎలా పని చేయించుకున్నారు? 020 పద్దు కింద ట్రెజరీ నుండి ఎలా జీతాలు చెల్లించారు ? 30 సం॥గా పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక శాఖల్లో అనుమతి తీసుకోకపోవడం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమీషనర్, ఐటిడిఎపిఓ, అధికారుల తప్పు కాదా? పనిచేసే కార్మికులకు వేతన భద్రత, పని భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది, గిరిజన సంక్షేమ శృఖది కాదా? అని జెఏసి ప్రశ్నిస్తున్నది. 30 సం॥గా ఆర్థిక శాఖకు తెలియకుండానే జీతాలు ఇచ్చారా ? ఆర్థిక శాఖ అనేది ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేశారా? ఇంతకాలం లేని అభ్యంతరాలను, ఇప్పుడు కొత్తగా సృష్టించి హాస్టల్ వర్కర్ల పొట్టగొడుతున్నారు. ఆర్థిక శాఖ అనేది ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వానికి అతీతమైనది కాదు. కాబట్టి అధికారాలు, ప్రభుత్వం వైపు నుండి జరిగిన పొరపాట్లు ఉంటే శాఖాపరంగా సరిచేయాలి తప్ప కార్మికుల జీతాలు తగ్గించి "గిరిజనులు నోటికాడ బువ్వను" గుంజుకోవడం అన్యాయం, అక్రమం తప్ప మొరకటి కాదు.
గిరిజన సంక్షేమం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ నీటి మీద రాతలే! ప్రభుత్వ చేతలన్నీ గిరిజన, ఆదివాసీ ప్రజలకు ద్రోహం కల్గించే విధంగా ఉన్నాయి. అత్యంత వెనుకబడిన గిరిజన కార్మికుల జీతాలను తగ్గించడం ద్వారా ప్రభుత్వం తన గిరిజన వ్యతిరేక చర్యలను నిరూపించుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3గురు మంత్రులు, 5గురు గిరిజన ఎంఎల్ఎలను ప్రజలు గెలిపిస్తే, గిరిజన కార్మికుల “నోటికాడ అన్నం ముద్దను” దూరం చేస్తున్నారు.
డైలీవేజ్ వర్కర్ల జీతాలు తగ్గించే జీఓ నెం.64ను, ఔట్సోర్స్ వర్కర్ల జీతాలు తగ్గించే జీఓ నెం.527ను రద్దు చేయాలని, డైలీవేజ్ వర్కర్లకు టైమేస్కేల్ ఇవ్వాలని, అప్పటివరకు కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలని, ఔట్సోర్సింగ్ వర్కర్లకు జీఓ నెం.60 ప్రకారం రూ.15,000/- లు ఇవ్వాలని సెప్టెంబర్ 12 నుండి సమ్మె చేస్తున్నారు. ఈ డిమాండ్స్ గురించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం సమ్మె చేస్తున్న వర్కర్లతో చర్చలు కూడా జరపలేదు. దసరా పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో జీఓ నెం.64 ప్రకారం జీతాలు తగ్గించి, రూ.11,700/-లు వేశారు. దీనివల్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కొక్క డైలీవేజ్ వర్కర్ నెలకు రూ.16,000/-లు నష్టపోయాడు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలో మాత్రం జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం, పాత జీతాలు వేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్ల ఎందుకు వివక్ష పాటిస్తున్నారు. ఆర్ధికమంత్రి సహా ముగ్గురు మంత్రులు, 5 గురు ఎంఎల్ఎలు ఉన్న జిల్లాల్లో జీతాలు కోత పెట్టడం మంత్రులు, ఎంఎల్ఎల వైఫల్యం, నిర్లక్ష్యం, అసమర్థత కాదా? అని జెఏసి ప్రశ్నిస్తున్నది. మంత్రులు, ఎంఎల్ఎలకు, ఎంపిలకు ఒక్కొక్కరికి 10 నుండి 20 సార్లు వినతి పత్రాలు ఇచ్చాము. సమ్మెకు ముందు, సమ్మె ప్రారంభమైన తరువాత మేము కలవని మంత్రి, ఎంఎల్ఎలు లేరు. అయినా ఏ ఒక్కరు మా సమస్య పట్ల బాధ్యతగా స్పందించలేదు. పిఎంహెచ్ వర్కర్లకు ఒక జిల్లాలో రూ.15,600/-లు ఇస్తూ మరొక జిల్లాలో రూ.9.200/-లు ఇస్తున్నారు. డైలీవేజ్, కాంటింజెంట్, పార్ట్ టైమ్ వర్కర్లకు ఒక జిల్లాలో మినిమం టైమ్ స్కేల్ ఇస్తూ మిగతా జిల్లాల్లో దాన్ని అమలు చేయడం లేదు. ఒకే డిపార్ట్మెంట్, ద్వంద్వ విధానాలు అమలు చేస్తున్నారు.
అభినందనలు ✊
పెరుమాళ్ళ పల్లి మోహన్ రావు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి.