అడ్డగూడూరులో బాణసంచాలు స్వాధీనం ఎస్సై వెంకట్ రెడ్డి

Oct 20, 2025 - 23:01
Oct 20, 2025 - 23:02
 0  1
అడ్డగూడూరులో బాణసంచాలు స్వాధీనం ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు 20 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

అడ్డగూడూరు మండల కేంద్రంలోని వెంకన్న కిరణం అనే షాపులో అక్రమంగా బాణసంచా నిలువఉంచి అమ్ముతున్నాడు అని సమాచారం మేరకు వెంటనే పోలీసులు వెంకన్న కిరణం షాపు దుకాణానికి వెళ్లి చూడగా బాణసంచాలు దొరికాయి. విచారణలో దుకాణ యజమాని కనదుకూరి వెంకన్న హనుమయ్య వయస్సు 60 సంవత్సరాలు కులం వైశ్య ప్రాంతం కిరణం సంబంధిత అధికారుల నుండి ఎటువంటి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా పర్మిట్ లేకుండా తాను కాకర పుల్లలు, లక్ష్మీ బాంబులు అమ్ముతున్నానని ఒప్పుకున్నాడు పంచుల సమక్షంలో అట్టి బాణాసంచా స్వాధీనం చేసుకొనడం జరిగింది.స్వాధీనం చేసుకున్న సామాగ్రి విలువ సుమారు 4వేలు ఉంటుంది. నిందితుడిని,ఆద్వినలోకి చేసుకున్న పోలీసులు బాణాసంచాలతో పాటు,మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.