గ్రామ అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పులికల్ గ్రామ యువత.

జోగులమ్మ గద్వాల 20 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- (ఐజ మండలం కేంద్రం)
పులికల్ గ్రామంలో గత కొన్ని నెలలుగా ఎమ్మిగనూరు మరియు మంత్రాలయం కు వెళ్ళేR&B,దారి పులికల్ గ్రామంలో చాల దారుణంగా గుంతల మయంలో ఉన్న రోడ్ ను ఎవ్వరు పట్టించుకోలేదు ఈ సమస్య పై స్పందిస్తూ పులికల్ గ్రామ యువకులు చాల కష్టపడి శ్రమదానం చేసి రోడ్డు ను బాగుచేయడానికి చాల కష్టపడి రోడ్డును వేశారు.అలాగే రోడ్డు ఇరువైపుల ఉన్న కంప చెట్లను తొలగించారు.గ్రామంలో ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు యువత గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో
బారికి దేవన్న, బోయ భూపతి నాయుడు,సప్లయ్ నాగరాజు , బోయలోకేష్,చాకలి కృష్ణ. శశి వర్మ తేజ,లొడ్డ నరసింహులు కురువ వెంకటేష్,(టైలర్) రేవల్లి మహేష్ , రంగస్వామి(తక్కశిల),B. వెంకటెష్ తదితరులు పాల్గొన్నారు.