కోతి కి హిందూ సంప్రదాయంలో అంతిమ సంస్కారాలు

అనారోగ్యంతో మృతి చెందిన కోతి కి హిందూ సంప్రదాయంలో అంతిమ సంస్కారాలు చేపట్టిన
రైల్వే జిమ్ పాషా, జగదీష్ గౌడ్_
జోగులాంబ గద్వాల 20 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- స్థానిక గద్వాల్ పట్టణంలోని MALD డిగ్రీ కళాశాలలో చనిపోయిన కోతి నీ చూసి చలించి పోయి మరణ సంస్కరణలు చేపట్టారు.
అయినవారు చనిపోతేనే పట్టించుకోని నేటి సమాజంలో... అనారోగ్యం బారిన పడిన వానరంపై మమకారాన్నిచాటారు. అనారోగ్యం తో మృతిచెందిన వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.