చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి..

దీపాల కాంతులవలె ప్రతి ఇంటా వెలుగులు నిండాలి.

Oct 20, 2025 - 00:08
Oct 20, 2025 - 00:10
 0  4
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి..

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

* తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్.

చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని.. దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామన్నారు. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగతో తెలంగాణ లోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధితో వెల్లివిరియాలన్నారు. అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించాలన్నారు. అలాగే బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. చిన్నపిల్లలను బాణాసంచాకు దూరంగా ఉంచాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333