తాగు నీటి కోసం రోడ్ ఎక్కిన విద్యార్థులు
జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గట్టు. మండలం పరిధిలోని ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గురువారం తాగునీటి సమస్యపై రాస్తా రోకో నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులు తాగునీరు లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాల సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టి తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.ప్లేట్లను పట్టుకొని రోడ్డుమీద బైఠాయించారు.
పై సమస్య త్వరగా పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.