అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

సీపీఎం మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
బీసీ రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలో చేర్చాలి!
అడ్డగూడూరు17 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ చలోరాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీస్ లు స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా సీపీఎం అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ..బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలో చేర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోధించి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించి అరునెలలు గడచిన అమోదించకుండా బీసీ రిజర్వేషన్ బిల్లును బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించ్చారు.బీసీ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలో చేర్చితే ఏ సమస్య ఉండదని,తాను కూడ బీసీనే అని చెప్పుకునే ప్రధాన మంత్రి మోడీ,బీసీ బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.42 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రులు ఎంపీలులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడ కేంద్రంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు వల్లంభట్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.