తెలంగాణ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి

Oct 16, 2025 - 20:03
 0  179

 – నారాయణ్ స్వామి కి సీనియర్ సిటిజన్ ఫోరం వినతి.

 జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పొద్దుచెర్రీ మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ రోజు గద్వాలను సందర్శించారు. ఈ సందర్బంగా సీనియర్ సిటిజన్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మోహన్‌రావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం ఆయనను కలసి వినతిపత్రం అందజేసింది.

మోహన్‌రావు మాట్లాడుతూ, గద్వాల నడిగడ్డ ప్రాంత ప్రజలు ఇప్పటికీ విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ ప్రాంతం రాయచూర్ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి గణనీయమైన అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున, గద్వాల–అలంపూర్ సహా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు కూడా అలాంటి అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయడం అవసరమని ఆయన సూచించారు. ఈ బోర్డు ఏర్పాటుతో వెనుకబడిన సరిహద్దు మండలాలకు ఆర్థిక, సామాజిక రంగాలలో కొత్త ఊపిరి దక్కుతుందని తెలిపారు.

“దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అభివృద్ధి బోర్డు ఏర్పాటు అవుతుందన్న ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఆ స్వప్నం నెరవేర్చే సమయం వచ్చింది” అని మోహన్‌రావు పేర్కొన్నారు.

1956 లో కర్ణాటక నుండి ఈ ప్రాంతం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతానికి నష్టం జరిగిందన్నారు.నీతి అయిగ్ ప్రతీపాడనాలను పూరించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం దే అని మోహన్ రావు విజ్ఞప్తి చేశారు.
నారాయణస్వామి ఈ వినతిని శ్రద్ధగా ఆలకించి, “ఈ అంశాన్ని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తాను, ప్రాంత అభివృద్ధి దిశగా పార్టీ కట్టుబడి ఉంది” అని హామీ ఇచ్చారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333