కలెక్టర్ కార్యాలయంలో రైతులు వినతిపత్రం..

డి రేపాక గ్రామ భూబాధిత రైతులు నిరసన కార్యక్రమం

Sep 23, 2025 - 20:48
Sep 23, 2025 - 20:50
 0  384
కలెక్టర్ కార్యాలయంలో రైతులు వినతిపత్రం..
కలెక్టర్ కార్యాలయంలో రైతులు వినతిపత్రం..

అడ్డగూడూరు 23 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని డి రేపాక గ్రామ భూబాధిత రైతులు కృషి యూత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారిక పేషి లో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రైతులు తమ ఆందోళనలను ఎడిషనల్ కలెక్టర్ తోపంచుకున్నారు. భూసేకరణ కారణంగా రేపాక గ్రామ రైతులు తమ పంట పొలాలను కోల్పోతున్నారని,ఈ భూసేకరణ కార్యక్రమాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలు,స్పష్టమైన నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా రైతులు కోరారు. స్పందనగా అధికారులు ఒక జీవో కాపీని వారికి అందజేశారు.అందులో రేపాక గ్రామం నుండి భూములు కోల్పోతున్న రైతుల వివరాలు కూడా పొందుపరచబడ్డాయి,

గ్రామ రైతులు మాట్లాడుతూ..ఈ భూములు మాకు జీవనాధారం, భూములను కోల్పోతే మా కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.