తిరుమలగిరిలో ..బంద్ ప్రశాంతం

తిరుమలగిరి 18 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బిసి కుల సంఘ నాయకుల ఆధ్వర్యంలో తిరుమలగిరి పాత ఊరు నుండి మొదలుకొని తెలంగాణ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మద్దతు తెలిపిన చిరు వ్యాపారుల నుండి మొదలుకొని పెద్ద పెద్ద వివిధ వ్యాపారస్తుల మరియు పెట్రోల్ బంకులు వరకు పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్కు పంపిస్తే, ఆ బిల్లులను గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లుల మీద ఎటువంటి స్పందన లేకుండా, ఆ బిల్లులను నిర్లక్ష్యంగా చూడడం వల్ల బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందలేకపోవడం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వనికి బీసీల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా బిల్లులను పరిశీలించి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 ని తీసుకొస్తే ఆ జీవోను రద్దు చేయాలని రెడ్డి జాగృతికి చెందిన నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో హైకోర్టు ఎన్నికల పై నాలుగు వారాలు స్టే విధించడం జరిగిందన్నారు. తక్షణమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని న్యాయపరమైన రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించి బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీలను అన్ని రంగాలలో అవకాశాలు దక్కే విధంగా చూడాలని కోరారు. ఈ బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మాజీ ఎంపీపీలు కొత్తగట్టు మల్లయ్య, కొమ్మినేని సతీష్ కుమార్, తన్నీరు రామ్ ప్రభు, బత్తుల శ్రీనివాస్ గిలకత్తుల రాము గౌడ్, ఏమోజు రవీందర్,కందుకూరి ప్రవీణ్, తుమ్మ చంద్రమౌళి, వై దీన దయాల్, చేను శ్రీనివాస్, ఏమొజు మధుచారి, పసునూరి శ్రీనివాస్,అడ్డబొట్టు చారి, కష్టమా చారి, చింతకింది సోమనారాయణ, వంగరి బ్రహ్మం, ముద్దంగుల యాదగిరి, బర్ల సోమేష్, పులిమామిడి సోమన్న, పులిమామిడి బిక్షం, పులిమామిడి వెంకన్న, దుస్స రామ్మూర్తి, సోమ నరసయ్య, గాదరబోయిన లింగయ్య యాదవ్, చింతకాయల సుధాకర్, శీలం ఉపేందర్ గౌడ్, సోమయాచారి, బిక్షమాచారి, వైట్ల మురళి, బాలకృష్ణ, రూపాని వెంకన్న, గూడూరు వెంకన్న, సోమేష్, తదితరులు పాల్గొన్నారు....