విద్యుత్ ఉద్యోగులు పల్లెబాట కార్యక్రమం
అడ్డగూడూరు మండల కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు పల్లెబాట కార్యక్రమం ఏఈ ఉమా*

అడ్డగూడూరు18 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో విద్యుత్ శాఖ సియండీ ఆదేశాల మేరకు పల్లెబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మండల కేంద్రంలో రహదారి వెంట ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల చుట్టూ ఉన్న చెట్లను తొలగించడం జరిగింది. ఇరిగిన, ప్రమాదకర విద్యుత్ స్తంబాలు గుర్తించడం జరిగిందని ఏఈ ఉమా తెలిపారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాలలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ లు బాలెంల దుర్గయ్య, వెంకన్న, కాంతారావు, ఉపేంద్రచారి రామచంద్రయ్య,వెంకటేశ్వర్లు శ్రీనివాస్ రెడ్డి, ఏయల్ఏంలు మచ్చగిరి, వెంకటేష్ ఆర్టిజెన్ లు నర్సింహా, నరేందర్ రెడ్డి, లక్ష్మణ్,శ్రీను పాల్గొన్నారు.