కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో హార్ట్ ఎటాక్ సిపిర్ పై అవగాహన కార్యక్రమం

108 అంబులెన్స్ సిబ్బంది ఇ ఏం టి నరేందర్ అవగాహన సదస్సు ను నిర్వహించారు
చిన్నంబావి మండలం 17 అక్టోబర్2025తెలంగాణ వార్త : చిన్నంబావి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయములో చిన్నంబావి మండల 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నరేందర్ స్కూలు విద్యార్థుల, టీచర్ల సమక్షంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఎంటి నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు మరియు టీచర్లు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. అత్యవసర సమయంలో సిపిర్ చెయ్యటం వల్ల ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చు అని, సిపిర్ ఎలా చెయ్యాలి, దాని ఉపయోగాలు, దాని ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి 108 అంబులెన్స్ సిబ్బంది ఈఏంటి నరేందర్, పైలట్ రవి ప్రిన్సిపల్ సుజాత, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.