ఎస్ ఆర్ ఎస్ పి కి నీటిని విడుదల చేయాలి.

Jul 19, 2024 - 20:57
Jul 19, 2024 - 21:09
 0  494
ఎస్ ఆర్ ఎస్ పి కి నీటిని విడుదల చేయాలి.

నాగారం జూలై 19:- ఎస్సారెస్పీకి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అంబేద్కర్ ఆర్ట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేరాల వెంకటేష్ పత్రికా ప్రకటనలో తెలిపారు. వర్షాకాలం లో వర్షాలు అనుకున్న స్థాయిలో పడకపోవడంతో రైతులు ఎస్సారెస్పీ కాలువ నీళ్ల పైన ఆధారపడవలసి వస్తుందని అన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో జాప్యం చేస్తే రైతులు ఒక సీజన్ పంటలు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. బోర్లు బావులు నీటిమట్టలు తగ్గిపోవడంతో  సాగు కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఎస్సార్ ఎస్పీకి నీటి విడుదల చేసి మండల రైతాంగని ఆదుకోవాలని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333