తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత

చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి
చిన్నంబావి మండల అధ్యక్షులు దేవని రమేష్ మాదిగ
చిన్నంబావి మండలం 17 అక్టోబర్2025తెలంగాణ వార్త : భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, పై బూటు విసిరి దాడికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్, నాయకులు డిమాండ్ చేస్తూ చిన్నంబావి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీ ఆర్ గవాయ్, పై జరిగిన దాడికి తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ, రాములుకు వినతి పత్రం అందజేడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల అధ్యక్షుడు దేవని రమేష్ మాదిగ, కాన్షిరాం మాదిగ ఎస్ శ్రీనివాసులు మాదిగ, చారకొండ బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని అన్నారు. గవాయ్ స్థానంలో అగ్రకులాలకు చెందిన జడ్జి ఉంటే ఈ దాడి జరిగి ఉండేది కాదని అన్నారు. గవాయిపై జరిగిన దాడితో దళితుల ఆత్మగౌరవం ప్రమాదంలో పడింది అని అన్నారు. దళితులు ఉన్నత స్థానంలో ఉండడాన్ని ఉన్నత వర్గాలకు చెందిన శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ఈ సంఘటన జరిగి పది రోజులు గడుస్తున్న ఇప్పటికీ నేరస్తుడి మీద కేసులు పెట్టకపోవడం, అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పై జరిగిన దాడిపై కేసు నమోదు చేయకపోతే ఈ దేశంలో సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ప్రశ్నించారు. ఇకనైనా తక్షణమే దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, వెంటనే కేసు నమోదు చేయాలని అలాగే ఈ సంఘటన వెనుక ఉన్న శక్తులను గుర్తించడానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుని అరెస్ట్ చేసేంతవరకు, దళితులకు రక్షణ కల్పించేంతవరకు ఈ పోరాటం ఆగదని అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు అక్టోబర్ 27న లక్షలాది మందితో హైదరాబాదులో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనను నిర్వహించి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు మండల అధ్యక్షుడు దేవని రమేష్ మాదిగ, కాన్షిరాం మాదిగ ఎస్ శ్రీనివాసులు మాదిగ, చారకొండ బాబు మాదిగ, కే శివకృష్ణ,నీరడి సహదేవ్, బోరేల్లి స్వాములు, గుంటి శ్రీరాములు సాగర్,వడ్డెమాన్ నరసింహ, తగరం శీను తదితరులు పాల్గొన్నారు.