డొమెస్టిక్ సిలిండర్లు అడ్డదారి పట్టించుకోని సివిల్ సప్లై అధికారులు

సూర్యాపేట జిల్లా కేంద్రం... సూర్యాపేట పట్టణం...
విచ్చలవిడిగా డొమెస్టిక్ సిలిండర్లు అడ్డదారి పడుతున్నాయి. వీటిని అరికట్టాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగి పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి హోటల్లో ,ఇడ్లీ బండ్లు, టీ స్టాల్స్ , పెద్ద పెద్ద హోటల్స్ ప్రతి ఒక వ్యాపారస్తుడు వద్ద విచ్చలవిడిగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. వీటిని ఆయా డిస్ట్రిబ్యూటర్ల కనుసనల్లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీళ్లు సివిల్ సప్లై అధికారులకు నెలనెలా అందజేయడంతో చూసి చూడనట్లు ఎవరిస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో డెమోస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు. ఇందులో పెద్ద మాఫియా నడుపుతున్నట్లు అర్థమవుతుంది. దీనిపై ప్రజా సంఘాలు, జర్నలిస్టలు దృష్టి సారించి ఈ అక్రమ దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.