18 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం ను పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ & కుకునూరు పల్లి పోలీసులు
తెలంగాణ వార్త కొండపాక:- కుక్కునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపాక మండల కేంద్రంలో తిరుపతి సాయి కృష్ణ s/o ఐలమల్లు వయస్సు 24 సంవత్సరాలు కొండపాక గ్రామం తన ఇంటిలో ప్రభుత్వ అనుమతి లేకుండా 18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పిడిఎస్ అక్రమంగా దాచి పెట్టాడని సమాచారంపై గురువారం ఉదయం సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు అధికారులు కుకునూరు పల్లి పోలీసులు వెళ్లి రైడ్ చేసి 18 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం పిడిఎస్ రైస్ ను పట్టుకున్నారు చర్యలు తీసుకుంటామని కుకునూరుపల్లి పోలీసులు వివరించారు
ఈ విధంగా సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు అధికారులు మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా పిడిఎస్ బియ్యం మరియు అక్రమ ఇసుక రవాణా చేసిన నిల్వ ఉంచిన చట్ట ప్రకారము కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జూదము గ్యాంబ్లింగు వంటి వాటి పై చట్ట వ్యతిరేక కార్యక్రమాల పై ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామాలలో పట్టణాలలో ఇసుక అక్రమ రవాణా చేసిన పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన దాచిపెట్టిన గ్యాంబ్లింగ్ పేకాట మరియు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లు 8712667445,8712667446,8712667447 సమాచారం అందించాలని సూచించారు సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు
కమిషనర్ కార్యాలయం నుంచి జారీ చేయడం జరిగింది