పత్తి పంట పండించిన రైతు సోదరులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

Oct 19, 2025 - 17:08
 0  0
పత్తి పంట పండించిన రైతు సోదరులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

తిరుమలగిరి 20 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 సిసిఐ కొనుగోలు కేంద్రంలో పత్తి పంటను అమ్ముకునే రైతు సోదరులు ముందుగా మీ మీ ప్రాంత వ్యవసాయ అధికారుల వద్ద సంప్రదించి పత్తి రైతు నమోదు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత మీ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో కాపా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చూసుకుంటే అందుబాటులో ఉన్న జీన్నింగ్ మిల్లు లో అమ్ముకునే ఆవకాశం ఉంది ,లేదా మీకు దగ్గరలో ఉన్న మార్కెట్ కమిటీ పరిధిలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో సంప్రదించి రైతులు స్లాట్ బుక్ చేసుకొని ,మీకు దెగ్గర లో ఏర్పాటు చేసిన జిన్నింగ్ మిల్లుల లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ద్వారా పత్తి పంటను విక్రయించగలరు. కావున పత్తి పంట పండించిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పత్రికా సమావేశంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యెల్సొజు చామంతి నరేష్ కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ డైరెక్టర్ లు రాపాక సోమేశ్ అంగొతు రాములు దొడ్డ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి