మృతుని కుటుంబానికి అండగా నిలిచిన అభ్యుదయ కమిటీ

తిరుమలగిరి 15 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గుండ్లపల్లి నరేష్ మరణించడం జరిగింది వారి కుటుంబానికి అండగా గ్రామ అభ్యుదయం కమిటీ తరుపున వారి కూతురు ఆధ్యా శ్రీ సుకన్య సమృద్ధి యోజన(SSA) పధకానికి సంబంధించిన ఖాతా ను 12500/- తో ప్రారంభించి గ్రామస్తులంతా అండగా నిలిచి పాస్ బుక్ ను వారి భార్య ఐన నవ్య కు వారి కుటుంబసభ్యుల,వారి కుల సభ్యుల, మరియు గ్రామ పెద్దమనుషులు సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో అభ్యుదయ కమిటీ అధ్యక్షులు నీరటి ప్రవీణ్, మరియు సభ్యులు గొడుగు రమేష్, వేల్పుగొండ యాదగిరి, ఇసరపు రవీందర్, జలగం మహేష్, గొలుసుల మహేష్,కనుకు కృష్ణయ్య, భాషమల్ల మల్లయ్య, ఏసి రెడ్డి, వెంకన్న, లక్ష్మయ్య మరియు పద్మాశాలి కుల పెద్దమనుషులు చింతకింది నర్సింహాస్వామి, మూడ వెంకన్న, గ్రామ పెద్దమనుషులు వేల్పుల నర్సయ్య, పోతారాజు రమేష్ పాల్గొన్నారు.