బిసి బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

బీసీ బంద్ కు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు, బీసీ కుల సంఘాలకు,, SC, ST మైనార్టీ సంఘాల కు ధన్యవాదాలు...
తిరుమలగిరి 20 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుమలగిరి మండల కేంద్రంలో కృతజ్ఞతా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రామ్ ప్రభు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును గవర్నర్ కు పంపిస్తే ఆ బిల్లులను ఆమోదముద్ర వేయకుండా నిర్లక్ష్యంగా ఉంచడం వల హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9ను పరిశీలించి గవర్నర్ ఆమోదముద్ర వేయలేదన్న కారణంతో నాలుగు వారాలు రిజర్వేషన్లపై స్తే విధించడం జరిగిందని అన్నారు. గవర్నర్ రిజర్వేషన్ బిల్లుపై ఆమోదం తెలిపితే స్టే విధించేది కాదని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను, కుల సంఘాలను, సామాజిక ఉద్యమ సంఘాలను అఖిలపక్షంగా ఏర్పాటుచేసి ప్రధానమంత్రి తో అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తే కేంద్ర ప్రభుత్వం ఆ ఒత్తిడికి తలోగ్గి రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేరిస్తే ఆ రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుందని అన్నారు. బీసీ బందును విజయవంతం చేసిన వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, కుల సంఘ నాయకులకు, ప్రజా సంఘ నాయకులకు, సామాజిక ఉద్యమ సంఘ నాయకులకు, విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, రైతు ఉద్యోగ, సంఘాలతో పాటు సకల వృత్తుల కు, విద్యా, వ్యాపార వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు పేరుపేరునా బీసీ సంక్షేమ సంఘం నుండి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వంగరి బ్రహ్మం, చింతకింది సోమనారాయణ, పులిమామిడి బిక్షం, ముద్దంగుల యాదగిరి, చింతకాయల సుధాకర్, దుస్సా రామ్మూర్తి, శీలం ఉపేందర్ గౌడ్, పొదిల కృష్ణ, గూడూరు వెంకన్న, పులిమాటి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.