జస్టిస్ బి.ఆర్ గవాయి దాడిపై ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత

Oct 17, 2025 - 19:56
 0  5
జస్టిస్ బి.ఆర్ గవాయి దాడిపై ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేత

ఎం.ఆర్.పి.ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ

అడ్డగూడూరు17 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సామాజిక ఉద్యమాల పెద్దన్న ఎం.ఆర్.పి.ఎస్ అధినేత పద్మశ్రీ మంద క్రిష్ణ మాదిగ ఆదేశానుసారం  ఈనెల 7వ తారీఖున సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయి పై దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసి శిక్షించాలని నేడు అడ్డగూడూరు కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎం.ఆర్.పి.ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాట్లాడుతూ..జస్టిస్ బి.ఆర్ గవాయి పై దాడి చేసిన శక్తులను గుర్తించి సుప్రీం కోర్టులో ప్రజాస్వామికా వాదులుగా గుర్తించబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలి ఈ దాడి అణాగారికమైంది.ఈ దాడి ప్రజాస్వామ్యంపై దాడీగా పరిగానిచల్సిన అవసరం ఉంది.ఇది యావత్ దళిత సమాజం పై దాడిగా అభివర్ణించారు జస్టిస్ బి.ఆర్  గవాయి దళితుడైనందునే ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేక ఆహంకారపూరీతంగా ఈ దాడికి పాల్పడ్డారు దాడికి పాల్పడిన వ్యక్తిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి దాడి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి  వారికి శిక్షలు పడేలా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు,ఎం.ఆర్.పి.ఎస్ అడ్డగూడూరు మండల ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్,సీనియర్ నాయకులు బాలెంల రాజు,గజ్జెల్లీ రవి,బాలెంల మహేందర్,బుర్రు అనిల్  దర్శనలా సతీష్, మందుల ఐలయ్య,డప్పు యాదగిరి,పోలికేక బాబురావు, గజ్జెల్లీ క్రిష్ణ,గూడెపు దామొదర్,బాలెంల పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333