ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండుతున్న పంటలు..
నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి....
*ఎండిన పంట పొలాలను పరిశీలించిన*
_మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి _
జోగులాంబ గద్వాల 26 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం కొండాపురం, వెంకటాపురం, ఉమీత్యాల గ్రామాలకు ర్యాలెంపాడు రిజర్వాయర్ నుంచి 104 ప్యాకేజ్ కింద సాగునీరు రాక ఎండిన వరి పొలాలను గద్వాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించి, రైతులతో మాట్లాడి,జిల్లా కలెక్టర్ B.M. సంతోష్ మరియు S.E.రహిముద్దీన్ తో చారవాణి ద్వారా మాట్లాడారు. అనంతరం, జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నీరు సరఫరాలో ప్రభుత్వం రైతాంగానికి ఇబ్బందులు కల్గించడం వల్ల ఎక్కువ పంటలు ఎండిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన హామీల్లో ఏ పథకం కూడా సవ్యంగా సాగడం లేదనన్నారు. రైతు భరోసా,రైతు రుణమాఫీ పథకాలు ప్రభుత్వం చెబుతున్న ప్రకారమే అట్టర్ ప్లాఫ్ అయ్యాన్నారు. ఏ గ్రామంలో చూసినా భరోసా, రుణమాఫీ అందని రైతులు కోకొల్లలుగా ఉన్నారన్నారు. వీటికి తోడు మళ్లీ వేసిన పంటలు సహితం ఇలా నీళ్లు కరెంటు సమస్యలతో ఎండిపోతుంటే రైతుల బాధలు చెప్పనలవి కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 448 మంది అన్నదాతలు ప్రభుత్వ నిర్వాకం వల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. ఇంత జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఆర్థిక, వ్యవసాయ, విద్యుత్‌శాఖల సమన్వయంతో పని చేస్తే.. గ్రామాల్లో ఒక్క పంట కూడా ఎండిపోయేది కాదని, అలాగే రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలు సక్రమంగా అమలు జరిగినా రైతుల మరణాలు ఉండేవి కాదన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సీఎంకు మాజీ సీఎంపై దుమ్మెత్తి పోయడం తప్పా మరొకటి లేదన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, మోనేష్, అంగడి బస్వరాజు, పటేల్ జనార్దన్ రెడ్డి, డి.శేఖర్ నాయుడు, ఎస్.రాము నాయుడు, శ్రీ రాములు, బిచుపల్లి, కురువ పల్లయ్య, బాసు గోపాల్, వెంకటేష్ నాయుడు, రాయపురం వీరెష్, కృష్ణ రెడ్డి, నక్క రవి,కిషోర్, నరసింహులు, మద్దిలేటి, వీరెష్ గౌడ్, ముని మౌర్య, తిరుమల్లేష్, ప్రహ్లాద్, చిన్న, సామెల్, ఆంజనేయులు, చిన్న హనుమంతు, కృష్ణ, అనిల్, నాయుడు, నల్ల గట్టు రాముడు, కామేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.