రాష్ట్ర ఫోటో గ్రాఫర్లందరూ కుటుంబ భరోసా పథకంలో చేరాలి రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్

Jul 21, 2025 - 20:35
 0  3
రాష్ట్ర ఫోటో గ్రాఫర్లందరూ కుటుంబ భరోసా పథకంలో చేరాలి రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్

 తిరుమలగిరి  22 జూలై  2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :

 రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ లందరూ కుటుంబ భరోసా పథకాన్ని సద్వినియం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ తెలిపారు. ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగూరి యాదగిరి అధ్యక్షతన జరిగిన తిరుమలగిరి మండలం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కూకుంట్ల లాలు హాజరై నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించి, రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, రాష్ట్ర కోశాధికారి మాధవరెడ్డి ల చేతుల మీద తిరుమలగిరి మండల నూతన అధ్యక్షుడు సుంకరి సుధీర్, ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, ఉపాధ్యక్షులు పరశురాములు, కుటుంబ భరోసా ఇంచార్జ్ అర్జున్, కార్యదర్శి మహేష్ లకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలగిరి మండలం నూతన అధ్యక్షుడు సుధీర్ మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండల ఫోటోగ్రాఫర్ లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో ప్రతి ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ లో కచ్చితంగా మండల సభ్యత్వం తీసుకోని, దేశంలోనే మొట్టమొదటిగా ఫోటోగ్రాఫర్ కుటుంబాలకు ఒక భరోసా కల్పించాలని ఉద్దేశంతో రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ భరోసా పథకంలో చేరి వారి కుటుంబానికి రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ భరోసా ఉంది అనే ధీమాతో కలిగి ఉండాలని అన్నారు. ఇప్పటివరకు ఎంతోమంది ఫోటోగ్రాఫర్ల కుటుంబాల్లో వెలుగుల నింపుతున్న రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగూరి యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ ఫోటోగ్రాఫర్ల సంక్షేమమే ధ్యేయంగా కుటుంబ భరోసా 10రూ., 100 రూపాయల పథకాలలాంటి చారిత్రాత్మక నిర్ణయాలతో అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కుటుంబ భరోసాలో చేరి వారి కుటుంబాలకు భరోసా ఉండేవిధంగా చేయాలనీ కోరారు. అనంతరం మండలంలోని నూతన సభ్యత్వం తీసుకున్న ఫోటోగ్రాఫర్లకు ఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రిభువనగిరి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, జనగాం జిల్లా అధ్యక్షుడు రామ్లక్ష్మణ్, రెడీన్ కలర్ ల్యాబ్ తిరుపతన్న, సూర్యాపేట జిల్లా కోశాధికారి బండారి లాలు కుటుంబ భరోసా ఇంచార్జి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్, తిరుమలగిరి మండల గౌరవ సలహాదారులు బానోత్ కిష్టు నాయక్,వర్రే గంగాధర్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు మధుకర్ రెడ్డి, సురుగూరి శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు, ఫోటోగ్రాఫర్లు, తిరుమలగిరి మండల ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034