టిఆర్ఎస్ పార్టీ కృషి ధర్నా ఫలితమే రోడ్డు శంకుస్థాపన

Jul 21, 2025 - 18:51
 0  2
టిఆర్ఎస్ పార్టీ కృషి ధర్నా ఫలితమే రోడ్డు శంకుస్థాపన

చర్ల జులై 21

చర్ల బస్టాండ్ నుండి కాలేజీ రోడ్డు అనేక గుంటలతో నిండి పోయిందని, ప్రజలు ఆ రోడ్డు పై ప్రయాణం చేయుటకు అనేక ఇబ్బందులు పడేవారని, బీఆర్ఎస్ పార్టీ మే 23 న ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారని, బీఆర్ఎస్ పార్టీ కృషి పలితమే రోడ్డు శంకుస్థాపన జరిగిందని బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు తెలియజేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. పాత చర్ల గాంధీ బొమ్మ నుండి శివాలయం సి సి రోడ్డు 2 నెలలకె పాడైందని, అధికారుల అలసత్వం అవినీతే కారణమని, ప్రజలు వాపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.