పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై సి.బి.ఐ. విచారణ జరపాలి
దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి
బిషప్ సాల్మన్ రాజు, రెవ. హాజర్య మిట్టగడప
అధ్యక్షులు ఇరుగు సంసోన్, ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్
తెలంగాణా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్.
బుధవారం 26 మార్చి : సూర్యాపేట మన్నా చర్చ్ లో సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు పాస్టర్ ఇంజమూరి గాబ్రియేల్ అధ్యక్షణ జరిగిన పాస్టర్స్ సమావేశంలో గౌరవ అధ్యక్షులు బిషప్ సాల్మన్ రాజు,రెవ. హాజర్య మిట్టగడప మరియు తెలంగాణా రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరుగు సంసోన్, ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్ నల్ల బ్యార్జిలతో నిరసన తెలుపుతూ తేది 25 మంగళవారం రోజు ఉదయ కాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల క్రైస్తవ నాయకులను విజయవాడ రాజమండ్రి హైవే ప్రక్కన హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రికరించిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షంచాలని, లేదా సుప్రీంమ్ కోర్టు కు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని,ఈ కేసు పై ఇప్పటికి అధికారులు స్వందించక పోవడం పట్ల, పలు అనుమానాలు రేకేతుతున్నాయని,వెంటనే ఈ కేసును సి.బి. ఐ.విచారణ చెపట్టాలని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. జలగం జేమ్స్, హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షులు రెవ. మేసా దేవసహాయం లు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల క్రైస్తవ సమాజం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన దైవజనుడనీ, వారి మరణ వార్త వినగానే హృదయంలో చాలా బాధ కలిగిందనీ తెలుగు రెండు రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం దైవ సేవకుల పక్షమున నిలబడి పోరాడిన గొప్ప యోధుడు దేవుడు తనకు ఇచ్చిన వాక్చాతుర్యంతో అనేక టీవీ ఛానల్లో మరియు యూట్యూబ్ ఛానల్ లో క్రైస్తవుల పక్షాన డిబేట్ లో సత్యం గూర్చి పోరాడిన గొప్ప యోధుడు అనీ ,ఇది యాక్సిడెంట్ మరణం కాదని, అతనిని హత్య చేశారానీ వెంటనే ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూన్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో పాస్టర్ బొక్క ఏలీయా రాజు, బ్రదర్ బొజ్జ ప్రశాంత్ కుమార్, తలకప్పల దయాకర్, ఉటుకూరి రాజు, పంది మార్క్, బోడ లూకా, రమేష్, యహోన్ తదితరులు పాల్గొన్నారు