శ్రీ సరస్వతి విద్యానికేతన్ లో ధ్యాన తరగతులు

Jul 21, 2025 - 18:55
 0  1
శ్రీ సరస్వతి విద్యానికేతన్ లో ధ్యాన తరగతులు

చర్ల జులై 21

శ్రీ సరస్వతి విద్యానికేతన్ లో గ్రామ ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ధ్యానం పై అవగాహన కల్పించడానికి తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ సరస్వతి విద్యానికేతన్ ప్రధాన ఉపాధ్యాయులు లిఖిత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో వైజాగ్ మాస్టర్ భీమినేని వంశీ కిరణ్ గారిచే నిర్వహించబడింది. వంశీ కిరణ్ గారు పిల్లలకు మనోవికాసం చాలా ముఖ్యమని తల్లిదండ్రులకు వివరించారు. మనోవికాసం లోపించడం వలననే పిల్లలు ధైర్యము గా ముందడుగు వేయలేకపోతున్నారు అని, ధ్యానం పిల్లలకు విశ్రాంతిని కలిగిస్తుందని, నేటి పరిస్థితుల దృష్ట్యా పిల్లలకు నిద్రకు తగినంత సమయం దొరకడం లేదని, అది ధ్యానం భర్తీ చేస్తుందని, వత్తిడిని తగ్గిస్తుందని, దీన్ని పిల్లలచే గత మూడు సంవత్సరాలుగా చేయిస్తున్న ఈ సరస్వతి విద్యానికేతన్ యాజమాన్యాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో భద్రాచలం నుంచి విచ్చేసిన మెడిటేషన్ మాస్టర్స్ వారి అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లిఖిత మాట్లాడుతూ మేమందరం ధ్యానం చేసి లాభం పొందాము. అదేవిధంగా అందరికీ కూడా ఆ లాభం చేకూరాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, శరీరానికి శక్తి ఎలా అవసరమో ఆత్మకి మనసు కి కూడా శక్తి తప్పనిసరిగా అవసరం అది ధ్యానం ద్వారా మనం పొందొచ్చు అని, అసలు ధ్యానంలో ఏముంది అని తెలుసుకోవడానికి అయినా ప్రతి ఒక్కరూ దాన్ని ఆచరించి చూడాలని ప్రార్ధించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి భీమినేని వంశీ కిరణ్ గారు వారి బృందం, తేగడ, చర్ల మరియు చుట్టుపక్కల గ్రామస్తులు, డాక్టర్ లయన్ నీలి ప్రకాష్ గారు, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు, పలువురు పెద్దలు హాజరయ్యారు. కార్యక్రమానంతరం స్కూల్ యాజమాన్యం వారు విచ్చేసిన వారికి భోజన వసతి కల్పించారు.