దివ్యాంగుల వితంతు పెన్షన్లు వెంటనే అమలు చేయాలి! 

జఎంపిఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య

Jul 19, 2024 - 12:58
Jul 19, 2024 - 19:59
 0  4
దివ్యాంగుల వితంతు పెన్షన్లు వెంటనే అమలు చేయాలి! 

తిరుమలగిరి 19 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని విలేకరుల సమావేశంలో సూర్యాపేట జిల్లా జిఎంపిఎస్ అధ్యక్షులు కడెం లింగయ్య మాట్లాడుతూ..వృద్ధాప్య వితంతు పెన్షన్లను తక్షణమే అమలు చేయాలి గత ఏడున్నర సంవత్సరముల నుండి పింఛన్లు ఇవ్వకపోవడం సోచనీయం పింఛన్ దారులు అప్లికేషన్ చేసుకొని ఆఫీసుల చుట్టూ తిరిగి నిరాశకు గురవుతున్నారు.గత ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు,ఒంటరి మహిళ, వికలాంగులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని మోసపూరితమైన వాగ్దానాలు చేస్తే ప్రజలు గమనించి తగిన గుణపాఠం చెప్పి గతప్రభుత్వాన్ని తుంగలో తొక్కడం జరిగింది.

  కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇందిరమ్మ ఇండ్లు,ఇళ్ల స్థలాలు వృద్ధాప్య పెన్షన్లు వీటన్నిటిని తక్షణమే అమలు చేయాలని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. అనేకమంది నిరుపేదలు ఇల్లు ఇళ్ల స్థలాలు లేక ఏం చేయాలో కొన్ని సంవత్సరాల నుండి అర్థం కాక ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీద ప్రజలకు హరులైన నిరుపేదలందరికీ మోసపూరితమైన వాగ్దానంతో అధికారంలోకి వస్తున్నాయి.ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల సమస్యలు మాత్రం మారటం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు.. పేద ప్రజల తరఫున జిఎంపిఎస్ గా ఈప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం తక్షణమే అమలు చేయాలి?ఈ ప్రభుత్వం అయినా అమలు చేయకపోతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో గత ప్రభుత్వానికే పట్టిన గతి పట్టక తప్పదు..అని చెప్పకనే చెప్తున్నాం జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు.