కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
మాడుగులపల్లి13 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- మాడుగులపల్లి మండలంలోని చిరుమర్తి గ్రామంలో సంక్రాంతి సంబరాలు సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇందులో భాగంగా భోగి పండుగను పురస్కరించుకొని గ్రామ మహిళలకు ముగ్గుల పోటీలు గ్రామ యువకులకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు ముగ్గుల పోటీలకు క్రీ, శే,గజ్జి నాగభూషణ్ జ్ఞాపకార్ధంగా గజ్జి మధుసూదన్ మొదటి బహుమతి 4,016 రెండవ బహుమతి 3016 మూడవ బహుమతి 2016 నాలుగవ బహుమతి 1016 లు అందజేశారు.వాలీబాల్ పోటీలకు మొదటి బహుమతి గ్రామ కాంగ్రెస్ పార్టీ 3016 రెండవ బహుమతి క్రీ.శే, చిత్తలూరి జానకమ్మ జ్ఞాపకార్ధంగా చిత్తలూరి బాలు 2016 మూడవ బహుమతి గ్రామ శాఖ అధ్యక్షులు వల్లోజు ప్రసాద్ 1016 అందజేశారు.గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల క్రీడల పోటీలు నిర్వహించడంలో గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.