కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో కుక్కకి అరుదైన శస్త్ర చికిత్స. కుక్క పొదుగులో మూడు కిలోల కణతులు తొలగింపు....పశు వైద్యాధికారి పి పెంటయ్య

Sep 20, 2024 - 16:38
Sep 20, 2024 - 17:17
 0  116
కోదాడ ప్రాంతీయ పశు వైద్యశాలలో కుక్కకి అరుదైన శస్త్ర చికిత్స. కుక్క పొదుగులో మూడు కిలోల కణతులు తొలగింపు....పశు వైద్యాధికారి పి పెంటయ్య

కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో కుక్కకి అరుదైన శస్త్ర చికిత్స 

కుక్క పొదుగులో మూడు కిలోల కణతుల తొలగింపు

పదివేల కేసుల్లో ఒకటి లేదా రెండు కేసుల్లో మాత్రమే ఇలాంటి కణితల నమోదు. 

అనుక్షణం ఒత్తిడితో మానవ జీవితాలు కొనసాగుతున్న నేటి కాలంలోమానసికొల్లాసానికి , కొందరు తమకి తోడుగా ,రక్షణగా , ప్రేమతో కొందరు కుక్కలని సాకడం రోజురోజుకి పెరుగుతుంది. తాము ప్రాణ ప్రదంగా అల్లారుముద్దుగా ఇంట్లో పిల్లలవలె సాదుకుంటున్న కుక్కలు అనారోగ్యానికి గురైతే తట్టుకోలేనంత ప్రేమను పెంచుకుంటున్నారు. ఎంత ఖర్చయినా , ఎంతదూరనైనా వెళ్లి వాటికి వైద్యం చేయించుకోవడానికి వెనుకాడడం లేదు.

 వివరాల్లోకి వెళితే కోదాడ పట్టణ నివాసి జూలూరు కృష్ణ పెంపుడు శునకం గత కొన్నాళ్లుగా పొదుగుకి కణతులై రోజురోజుకూ పెరిగి పొదుగు అంతటా వ్యాపించి ఒకవైపు కణితి పగిలి రక్తం కారుతూ నొప్పులతో విపరీతంగా బాధపడుతుండగా ప్రాంతీయ పశువైద్యశాల కోదాడలో చూపించారు.

 ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పిపెంటయ్య శునకాన్ని పరిశీలించి ఇప్పటికే పొదుగు అంతా వ్యాపించిన కణితులు ఆలస్యం చేయకూడదని శస్త్ర చికిత్స తక్షణ అవసరంగా గుర్తించి కుక్కల శస్త్ర చికిత్సలో నుపుణులైన అసిస్టెంట్ డైరెక్టర్ డా. రూపకుమార్ ని పిలిపించి మూడుగంటల పాటు శ్రమించి కుక్కకి శస్త్ర చికిత్స నిర్వహించి విజయవంతంగా మూడుకిలోలు ఉన్న కణుతులను తొలగించి కుక్కికి జీవితాన్ని పొడిగించారు

 శస్త్రచిత్స అనంతరం యజమాని , కుటుంబ సభ్యులు అమితానందంతో తమ నేస్తాన్ని చూసుకొని సంతోషించారు

శస్త్రచికిత్సలో సిబ్బంది రాజు , చంద్రకళ , ప్రశాంత్ పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State