నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

Jun 25, 2024 - 06:36
Jun 25, 2024 - 11:16
 0  3
నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

తెలంగాణ నేతకాని సంఘం జేఏసీ నాయకులు జాడి ఈశ్వర్ నేతకాని.

ములుగు జూన్ 24 తెలంగాణ వార్త :- ములుగు జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో నేతకాని కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఏజెన్సీ ప్రాంతం లో నివసిస్తున్న నేతకాని కులస్తులకు గిరిజనులతో సమాన హక్కులు కల్పించాలని కోరుతూ తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల సంఘం ప్రజా జేఏసీ నాయకులు జాడి ఈశ్వర్ నేతకాని ములుగు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, జిల్లా కలెక్టర్ కు దరఖాస్తులు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షలకు పై చిలుకు ఉన్న మా కులస్తులను రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా కులస్తులు అభివృద్ధికి నోచుకోవడం లేదని, దరిద్ర రేఖకు దిగువన ఉన్నారని, ఇన్ని సంవత్సరాల స్వాతంత్య్ర భారతం లో ప్రభుత్వ సంక్షేమాలు మాకు అందని ద్రాక్షలా మరాయాని, అందుకే మా కులానికి ప్రత్యేక నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో రాజుల పరిపాలన, బ్రిటిష్ పరిపాలన కంటే ముందు నుండి ఇదే ప్రాంతం లో పుట్టి, పెరిగి , ఇదే మట్టిలో కాలం చేస్తున్నామని, కానీ ఇప్పుడున్న ఏజెన్సీ చట్టాల వలన మా కులస్తులకు చదువుకున్న, ఉద్యోగ అవకాశాలు తక్కువ, వ్యవసాయం చేద్దామంటే భూమి లేదు, ఉన్న గింతంత భూమికి దిక్కు లేదు, హక్కు పత్రాలు లేవని, ప్రభుత్వం మా కులస్తులను నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలో మా కులస్తులను బ్రిటిష్ వాళ్ళు కొండ గిరిజనులను గుర్తించారని, భారత రాజ్యాంగ లో అది పొందుపరచక పోవడం వలన, ఏజెన్సీ చట్టాలు మాకు వర్తించక , ఈ ప్రాంతం లో చస్తూ బ్రతుకుతున్నామని , ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న మా కులస్తులకు గిరిజనులతో సమాన హక్కులు కల్పించేలా జీవో విడుదల చేసి, అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు , మా నేతకాని కులానికి సరైన న్యాయం చేయని పక్షంలో అసెంబ్లిని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.