తెలంగాణ బార్ కౌన్సిలర్ మెంబర్ గా ఇటుకల చిరంజీవి
అడ్డగూడూరు 03 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని కోడంపేట గ్రామానికి చెందిన ఇటికాల చిరంజీవి హైకోర్టులో తెలంగాణ బార్ కౌన్సిలర్ న్యాయవాదిగా శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు.జీవిత ప్రస్థానం, ఇటికాల చిరంజీవి అడ్డగూడూరు మండల పరిధిలోని కొండంపేట గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో 1987 మే 20 తేదీన జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు ఇటికాల అంజమ్మ యాదయ్య 2002లో మోత్కూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ విద్య మోత్కూర్ లోనే పూర్తి చేశారు.బి ఎ ఎల్ ఎల్ బి బషీర్బాగ్ హైదరాబాదులో పూర్తి చేశారు. చదువుతోపాటుగా సామాజిక ఉద్యమాలతో పాటు విద్యార్థి ఉద్యమకారుడుగా ఆనాటి తల్లి తెలంగాణ పార్టీలో తుంగతుర్తి అసెంబ్లీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అక్కడి నాయకుడిగా వెలు తిరగలేదు. 2000 ఎనిమిది నుండి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుని గా ఎదిగారు, దీనికి ఆ పార్టీ అతనికి 2012లో మోత్కూర్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించింది. ఆనాటి నుండి నేటి వరకు పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేస్తూనే ప్రతి కార్యకర్తకు సుపరిచితుడుగా ఎదిగారు తన చిరునవ్వుతోనే శత్రువులను సైతం స్నేహితులుగా చేసుకోవడం అతని గొప్పతనానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ 2020 లో రాష్ట్ర టీపీసీసీ నాయకునిగా ఎన్నుకోవడం జరిగింది. నేటికి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ పార్టీలో ఉన్న చిన్న పెద్ద నాయకులను సైతం కల్పికపోతూ ఉదార సభవంతో దూసుకుపోతున్న నాయకుడు ఇటికాల చిరంజీవి.తుంగతుర్తి ప్రస్తుత శాసనసభ్యులు మందుల సామెల్ ఎన్నికల్లో కీలక భూమిక పోషించారు,అడ్డగూడూరు మండలంలోని నాయకులందరినీ ఏకతాటిపై తీసుకురావడంలో చెరుగని ముద్రను వేశారు. ఇటికాల చిరంజీవి. టిపిసిసి రాష్ట్ర నాయకుడిగా ఉంటూనే సంవత్సరం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా తన గొప్ప మనసుతో విత్ విత్తు డ్రా చేసుకోవడం వారి గొప్పతనం.. రాజకీయ పార్టీని నమ్ముకుంటూ..తన చదువును కూడా పూర్తి చేశారు. హైదరాబాదులో శనివారంనాడు ప్రముఖ న్యాయస్థానం హైకోర్టులో బార్ కౌన్సిలర్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.ఇటికాల చిరంజీవి హైకోర్టులో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకు పలువురు రాష్ట్ర నాయకులు,మండల నాయకులు, శుభాకాంక్షలు తెలియజేశారు.ఇది ఆయన వ్యక్తిగత జీవితంలో, రాజకీయ జీవితంలో ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు.
ఇటికాల చిరంజీవి ప్రజలకు సేవ చేయడం అనేది తన విద్యార్థి దశ నుంచే ప్రారంభించాడు తన కూతురు మెర్సీ జ్ఞాపకార్థం "మెర్సీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్" ఏర్పాటు చేసి పేద ప్రజలను చదువుకు దూరమైన ఎంతో మంది విద్యార్థులకు ఆర్థికంగా భరోసాను కల్పించారు.ఇటుకల చిరంజీవి. న్యాయవాదిగా తన సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవకుడుగా రాష్ట్ర బార్ కౌన్సిలర్ మెంబర్ గా, సామాజికవేత్తగా, మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటునట్లు కుటుంబ సభ్యులు కొండంపేట గ్రామ ప్రజలు అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన శ్రేయోభిలాషులు తెలియజేశారు.