భద్రాచలంలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించి నూతన భవనము నిర్మించాలి

Dec 30, 2024 - 18:51
 0  3
భద్రాచలంలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించి నూతన భవనము నిర్మించాలి
భద్రాచలంలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించి నూతన భవనము నిర్మించాలి
భద్రాచలంలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించి నూతన భవనము నిర్మించాలి

భద్రాచలంలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించి నూతన భవనము నిర్మించాలి: జాతీయ మానవ హక్కుల సంఘం (NHRCOI) భద్రాచలం మండలం 

భద్రాచలంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని సోమవారం జాతీయ మానవ హక్కుల సంఘం నూతన కమిటీ సందర్శించి గ్రంథాలయం లోపల ఉన్నటువంటి సమస్యలను గురించి విద్యార్థులతో చర్చించి గ్రంథాలయం కు కావలసిన వసతులు ప్రస్తుతం ఉన్న అవసరాలు గురించి మాజీ గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు గారితో మరియు లైబ్రేరియన్ ఎస్కే జానీ గారితో చర్చించి ప్రస్తుతం కావలసినటువంటి మౌలిక వసతులు గురించి తెలుసుకున్నారు.

జాతీయ మానవ హక్కుల సంఘం నూతన కమిటీ నిర్ధారించిన ముఖ్యమైన అంశాలు

* ప్రస్తుతం ఉన్నటువంటి భవనము వర్షాకాలంలో పైకప్పు నుంచి నీరు కారుతుంది కావున వెంటనే పాత భవనం తొలగించి రెండు అంతస్తుల నూతన భవనము నిర్మించాలి 

* గ్రంథాలయంకు  కేటాయించిన స్థలంలో ఆధునిక అన్ని వసతులతో కూడిన నూతన ఆడిటోరియం నిర్మించాలి

* ప్రస్తుతం విద్యార్థులకు ఎప్పటినుంచో గ్రంథాలయంలో మరుగుదొడ్ల సమస్య ఉన్నది కావున వెనువెంటనే విద్యార్థులకు మరుగుదొడ్లను నిర్మించాలి 

* గ్రంథాలయంలో ఎప్పటికప్పుడు కొత్త ఎడిషన్ పుస్తకాలను, బిట్ ప్రాక్టీస్ పుస్తకాలను అందుబాటులోకి ఉంచాలి

* గ్రంథాలయం పరిసరాల పరిరక్షణ కొరకు నూతన కాంపౌండ్ వాల్ నిర్మించాలి ఇది లేకపోవడం వలన గ్రంథాలయంలోకి పశువులు, కుక్కలు పందులు సైర విహారం చేస్తున్నాయి

* గ్రంధాలయాలలో 24 గంటల సీసీ కెమెరాలు అందుబాటులో ఉంచి ఈవో మరియు ఐటీడీఏ పిఓ గారి నిఘానేత్రంలో ఉంచాలి 

* పాతకాలం లాగా గ్రంథాలయంలో వారానికి ఒకసారి విద్యార్థులకి సివిల్ సర్వెంట్ అధికారులతో నిర్ణీత సమయం పాటు స్పెషల్ క్లాసులు నిర్వహించాలి 

* గ్రంథాలయాల ఆర్థిక వనరుల కోసం గ్రంథాలయం కాంపౌండ్ వాల్ వెంబడి గ్రంథాలయ పరిధిలో చిన్న చిన్న షాపులను నిర్మించి వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రంథాలయ అభివృద్ధికి ఉపయోగించాలి 

అని జిల్లా కలెక్టర్ గారికి, ఐ టి డి ఏ పి ఓ భద్రాచలం గారికి, గ్రామపంచాయతీ ఈవో గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానహ హక్కుల సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పోడుతూరి ప్రేమ్ సాయి గారు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గూగులోత్ బాబు గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ మామిడి పుల్లారావు గారు మరియు లైబ్రేరియన్ ఎస్కే జానీ గారు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333