ఆర్ఎంపీ ఆస్పత్రులను సీజ్ చేసిన జిల్లా వైద్య అధికారులు

Feb 22, 2024 - 20:09
Feb 22, 2024 - 20:46
 0  78
ఆర్ఎంపీ ఆస్పత్రులను సీజ్ చేసిన జిల్లా వైద్య అధికారులు
ఆర్ఎంపీ ఆస్పత్రులను సీజ్ చేసిన జిల్లా వైద్య అధికారులు
ఆర్ఎంపీ ఆస్పత్రులను సీజ్ చేసిన జిల్లా వైద్య అధికారులు

జోగులాంబ గద్వాల 22 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల గురువారం మత్తు ఇంజక్షన్ లకు ప్రజలను బానిస చేస్తున్న  "ఆర్ఎంపీలు" అని ఓ దినపత్రిక, ఓ మీడియాలో రావడంతో జిల్లా  అధికారులు కేటి దొడ్డి, గట్టు మండలలో ఆకస్మిక దాడులు నిర్వహించి పలు ఆర్ఎంపీ క్లినిక్ లు సీజ్ చేయడం జరిగింది.

జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాకలెక్టర్ ఆదేశాలమేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్. శశికళ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దేశాల మేరకు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్దప్ప మరియు పోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి.రాజు  మరియు జిల్లా వైద్య సిబ్బంది మొత్తం '10' మంది. ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలు అయిన కేటి దొడ్డి, నందిన్ని కుచ్చినెర్ల, గొర్ల ఖాన్ దొడ్డి తదితర గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేయగా..ఆయా చికిత్స కేంద్రాలలో సొంత వైద్యం మరియు ప్రభుత్వం నిషేధించిన మత్తు మందులు వాడుతూ పేషంట్లను మత్తు మందులకు అలవాటు చేస్తు, సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ. కనబడటం జరిగింది .మరియు. మెడికల్ షాపులను కూడా వారే నడుపుతున్నట్టు తనఖీలో బయట పడింది. అట్టి ప్రథమ చికిత్స కేంద్రాలను అనగా కేటి దొడ్డి, నందిన్ని గ్రామాలతో సీజ్ చేయడం జరిగింది. ఇంకో ఆర్ఎంపీ దగ్గర ఉన్న నిషేధిత మందులు తీసుకొని రావడం జరిగినది.

     ఈ సందర్భంగా వైద్యాధికారు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ లు కేవలం ప్రథమ చికిత్స మాత్మమే చెయ్యాలి, ఇంజెక్షన్ మరియు సెలెన్లు వాడరాదని వాడితే నేరంగా- పరగణించి తగు చర్యలు తీసుకొనబడిని తెలిపారు.

సీజీచేసిన వారి వివరాలు:

శ్రీకాంత్ , రఘు (కేటి దొడ్డి గ్రామము) కంసాలి కృష్ణ, (నందిన్నె) ఇతని దగ్గర మందులను సీజ్ చేసి తీసుకొని రావడం జరిగినది.మిగితా వారి సమాచారం తెలుసుకొని షాపులన్ సీజ్ చేసుకొని పావడం జరిగిందని అధికారులు తెలిపారు.

    ఈ కార్య క్రమంలో..డిప్యూటి డి.యం. హెచ్ఓ. డాక్టర్ సిద్దప్ప పార్టీ మరియు పోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. రాజు, ఓడిఎమ్. రామాంజినేయులు జిల్లా పోగ్రాం కో ఆర్డినేటర్ శ్యామ్ సుందర్, మక్మూద్,సూపర్ వైజర్ నర్సింహులు, హర్యానాయక్ హెల్త్ అసిస్టెంట్. నర్సయ్యలు పాల్గొన్నారు...

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State