లారీ పెట్టి డైరెక్ట్ గా బెల్ట్ షాప్లకి మద్యం సరఫరా
*లారీ పెట్టీ డైరెక్ట్ బెల్ట్ షాపులకే మద్యం సరఫరా... లక్మి పురం సిండికేట్ వ్యాపారుల ఇష్టా రాజ్యం*
*వాహనాలు పెట్టి పొరుగు రాష్ట్రాలకు తరలింపు*
*మద్యం అక్రమ రవాణాను అరికట్టాలని... ఆదివాసీ సంఘాల డిమాండ్*
వాజేడు తెలంగాణ వార్త ఫిబ్రవరి 1:
ములుగు జిల్లా వాజేడు మండలంలో లక్ష్మి పురం కనక దుర్గ వైన్స్ సిండికేట్ వ్యాపారానికి అడ్డుఅదుపు లేకుండా పోయింది.పట్టపగలే మద్యం ఏరులై పారుతుంది.... సిండికేట్ వ్యాపారులు లారీలతో బెల్ట్ షాపుల వద్దకే మద్యం సరఫరా చేయడం చూసిన స్థానికులు మండి పడుతున్నారు.అధిక ధరలకు మద్యం అమ్మకాలు జరుపుతూ పొరుగు రాష్ట్రాలకూ అక్రమంగా మద్యం తరలిస్తున్న కనక దుర్గ వైన్స్ పై ఎక్సెంజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని లేనియెడల ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తాము అని అదేవిధంగా ఆదివాసీ గిరిజన బిడ్డల బినామీ పేర్లతో చీకటి ఒప్పందానికి తెరలేపి ఆదివాసీలపై ఆధిపత్యం చెలాయిస్తున్న వారినీ తొలగించాలని ఆదివాసి సంఘా నాయకులు పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాల్లో అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని వాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ మద్యం అమ్మకాలు చేస్తున్న సిండికేట్ వ్యాపారులు ఎక్సేంజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోక పోవడం చర్చనీయాంశం అయ్యింది. వైన్ షాప్ నిబంధనలకు విరుద్ధంగా లారీతో బెల్ట్ షాపులకు తరలిస్తూ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఎవరు స్పందించకపోవడం గమనార్ధం.,ఒకవైపు ప్రజా ప్రభుత్వంలో బెల్ట్ షాపులను రద్దు చేయాలని, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఇప్పటికి ఈ ప్రాంతంలో మాత్రం అది అమలు కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇకనైనా ఉన్నతాధికారులు బెల్ట్ షాపులపై ప్రత్యేక దృష్టి పెట్టి బెల్ట్ షాపులను తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.