బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
వాజేడు ఫిబ్రవరి 1 : తెలంగాణ వార్త
ములుగు జిల్లా వాజేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన వాసం నాగలక్ష్మి ఇటీవల ద్విచక్ర వాహనం పై నుండి కింద పడి తలకు తీవ్రంగా గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ పదివేల రూపాయలు వాసం నీలాద్రి కి అందజేయడం జరిగింది. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలియజేశారని వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాదరాజు నాగారం మాజీ సర్పంచ్ తల్లడి ఆదినారాయణ సొసైటీ ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాథరాజు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు దాట్ల వాసు బాబు మైనార్టీ నాయకులు ఎస్కే కాజావలి తల్లడి నాన్న బాబు చెన్నం స్వామి అనుముల సంజీవరావు తదితరులు పాల్గొన్నారు