నూతన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగ
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ :-నూతన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మేడి కృష్ణ మాదిగ © ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెంటనే అమలుపరచాలి: యాతాకుల రాజన్న మాదిగ - స్థానిక ఆత్మకూరు మండల కేంద్రం లో పూర్వ విద్యార్థుల భవనంలో ఎమ్మార్పీఎస్ , ఎమ్మెస్పీ మరియు అనుబంధ సంఘాల నూతనపునర్నిర్మాణ కమిటీ ఎన్నిక సమావేశం నియోజకవర్గ ఇన్చార్జి *ములకలపల్లి రవి మాదిగ* అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశ ముఖ్య అతిథిలుగా MRPS,MSP జిల్లా కోఆర్డినేటర్స్ *యాతాకుల రాజన్న మాదిగ, చింత వినయ్ బాబు* మాదిగలు పాల్గొని మాట్లాడుతూ " మహా జననేత మానవతా ఉద్యమాల పితామహుడు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాతనే మాదిగ జాతికి ఆత్మగౌరవం, గుర్తింపు వచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మొదలైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం లక్ష్యసాధన కోసం ఏకంగా భారత ప్రధానమంత్రిని కూడా కదిలించిన చరిత్ర ఉందని అన్నారు.ఎమ్మార్పీఎస్ డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణలో ఉన్న న్యాయబద్ధతను గుర్తించిన సుప్రీంకోర్టు ఆగష్టు 1 వ తేదీన ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని చారిత్రాత్మక తీర్పును ఇచ్చిందని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగ జాతికి అన్యాయం చేస్తున్నాడని అన్నారు. నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకువచ్చే మొదటి రాష్ట్రం తెలంగాణను నిలబెడుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీని విస్మరించి మాదిగ జాతికి నమ్మిక ద్రోహం చేశాడని అన్నారు. అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు 11062 టిచర్ పోస్టులను భర్తీ చేసి మాదిగలకు ముఖ్యమంత్రి అన్యాయం చేశాడని అన్నారు.కనుక ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాదిగ బిడ్డలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎమ్మార్పీఎస్ ఉద్యమ పునర్నిర్మాణంలో మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు యువకులు పెద్ద భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తదనంతరం ఆత్మకూరు మండలం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులుగా: *మేడి కృష్ణ మాదిగ* అధికార ప్రతినిధిగా మిరియాల చిన్ని మాదిగ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి గంగరాజు మాదిగ ఉపాధ్యక్షులుగా పిడమర్తి ఉమేష్ మాదిగ బొల్లంపల్లి అంజయ్య మాదిగ కార్యదర్శిగా ఎడవల్లి కార్తీక్ మాదిగ ములకలపల్లి నరేష్ మాదిగ సంయుక్త కార్యదర్శిగా ములకలపల్లి కిరణ్ మాదిగలను. మరియు మహాజన సోషలిస్టు పార్టీ(MSP) మండల అధ్యక్షులుగా:*వీరమల్ల నవీన్ మాదిగ* అధికార ప్రతినిధిగా: పెడమర్తి శ్రీను మాదిగ ఉపాధ్యక్షులుగా; బచ్చలకూరి జానయ్య మాదిగ లను ఎన్నుకొని నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ ఎర్ర వీరస్వామి మాదిగ సీనియర్ నాయకులు కనుకుంట్ల వెంకన్న మాదిగ, కోడి వెంకటయ్య మాదిగ, బత్తుల వెంకట రాములుమాదిగ,మేడి కృష్ణా మాదిగ తిప్పర్తి గంగరాజు, వీరమల్ల నవీన్ మాదిగ, పెడమర్తి వెంకటయ్య పిడమర్తి రాములు పల్లెల రాము మాదిగ ఎడవెల్లి కార్తీక్ మాదిగ యాతాకుల ప్రసాద్ మనోజ్ మాదిగలు తదితరులు పాల్గొన్నారు