లక్ష్యసాధనకు పోరాటమే   ఆ శయం కావాలి. అని వార్యమైతే తప్ప బలి దానాలకు సిద్ధపడకూడదు.

Oct 13, 2024 - 20:59
Nov 18, 2024 - 15:22
 0  2
లక్ష్యసాధనకు పోరాటమే   ఆ శయం కావాలి. అని వార్యమైతే తప్ప బలి దానాలకు సిద్ధపడకూడదు.

శత్రువును మట్టు పెట్టడమే  ఉద్యమకారుల కర్తవ్యం
ఈ లక్షణాలన్నీ మూర్తిభవించిన  భగత్ సింగ్  నాటి, నేటి, రేపటి తరానికి ఆదర్శం.*  సమ సమాజ స్థాపన కు ఉద్యమాలే శరణ్యం... కాదంటారా ?

వడ్డేపల్లి మల్లేశం

 పాలకులు లేదా  వారి అనుచరులు  మనుషులను చంపగలరేమో కానీ  వారి ఆదర్శాలను చంపలేరు" అనే విశ్వాసం నిండిన  భగత్ సింగ్  స్వతంత్ర పోరాటంలో    చివరి రక్తపు బొట్టు వరకు  రాజీలేని   ఉద్యమ కార్యాచరణ ద్వారా  ఉరి కంభం ఎక్కినాడు కానీ  రాజీ కుదర్చడానికి  మధ్యవర్తులు ప్రయత్నిస్తే తృణీకరించిన   ధీరుడు ఆయన . లక్ష్య సాధన కోసం పోరాటాన్ని జీవిత ఆశయంగా ఎంచుకొని  అని  వార్యమైతే శత్రువులను మట్టు పెట్టడానికి కూడా  ఉద్యమం వెనకడుగు వేయకూడదని   అధికారులు జడ్జిల పైన కూడా  బాంబులు విసిరిన కేసులో ముందుండి  బానిస సంకెళ్లను తె0 చుకోవడం ద్వారా  సమ సమాజ స్థాపనకు ఉద్యమాలు ఏనాడైనా అనివార్యమని  ఆనాడే చాటి చెప్పినవాడిగా భగత్ సింగ్ ను మనం చూడాల్సి ఉంటుంది.  ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో మేలవించి  దేశం ఎదుర్కొంటున్న సకల సమస్యల పరిష్కారంలో ప్రజల పక్షాన నిలబడడానికి  భగత్ సింగ్ చూపిన మార్గాన్ని  నేటి యువత,  విద్యార్థులు,  ఉద్యమ భావజాలం కలిగిన  అందరూ కూడా  పోరాటానికి  సిద్ధపడడం ద్వారా  భగత్ సింగ్ జయంతి సందర్భంగా  ఘనమైన నివాళిని అర్పించవలసి ఉన్నది.  బలిదానాలను  బలమైన శత్రువుకు భయపడి కాకుండా  అనివార్యమైనప్పుడు,  పోరాటంలో  ఎత్తుగడల రూపంలో,  హింస ప్రేరేపించబడి  శత్రువు చేతికి చిక్కినప్పుడు,  తప్పదనుకున్నప్పుడు చంద్రశేఖర్ ఆజాద్    తనను తానే కాల్చుకొని ఆత్మార్పణ చేసినాడు.  కానీ భగత్ సింగ్  న్యాయస్థానం విధించిన శిక్షను  రాబోయే తరాలకు  వెన్నుదన్నుగా ఉండాలని కాబోలు ఉరికంబాన్ని  ముద్దాడి  చిన్న వయసులో  తనకంటూ చరిత్రను లిఖి0చుకున్న  భగత్ సింగ్ చరిత్రను  విస్తృత రీతిలో పాఠ్యాంశాలలో మేలవించి   విద్యార్థులకు  బోధించి  కర్తవ్యాన్ని గుర్తింప చేయవలసిన  అవసరం నేటి తరం ఉపాధ్యాయుల పైన ఎంతో ఉన్నది . '"చరిత్రను అధ్యయనం చేయడం మాత్రమే కాదు  ప్రతి వ్యక్తి తన చేష్టలు , కర్తవ్యాలు, త్యాగాలు,  చర్యల ద్వారా  తనకంటూ ఒక చరిత్రను నిర్మించుకోవాలి  అది భవిష్యత్తుకు  ఆదర్శంగా ఉండాలి"  అని వక్కాణించిన  తొలి ప్రధాని నెహ్రూ మాటలను  నేటి తరం  నిజం చేయాల్సిన అవసరం ఉంది . "సమకాలీన రాజకీయ సామాజిక ఆర్థిక  సమస్యలు ,సంక్షోభాలు,  నివారణలో భాగంగా  ప్రజల పక్షాన పోరాడవలసిన ప్రతి సన్నివేశంలోనూ  సామాజిక బాధ్యతతో  ముందు వరుసలో ఉంటే  అదే ప్రతి వ్యక్తికి చరిత్రగా మిగిలిపోతుంది."  ఈ స్పృహను స్ఫూర్తిని  భగత్ సింగ్ ద్వారా పొంది  స్వతంత్రం సాధించిన  భారతదేశము తదనంతర కాలంలో  ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల నుండి  అధిగమించడానికి పోరాటాలు తప్ప  గత్యంతరం లేని పరిస్థితిలో  స్వార్థ రాజకీయాల  నేపథ్యంలో  ఈనాడు మరింత  జాగరూకతతో ప్రతి వ్యక్తి  బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి ఉన్నది  అని  సోయి తెచ్చుకోవడానికి మనకు చరిత్ర ఎంతో దోహదపడుతుంది .
     వ్యక్తిత్వం  --జీవన పోరాటంలోని ముఖ్యంశాలు:-
*******౮*****౮
   భగత్ సింగ్ జన్మించే నాటికి భారతదేశం లోకి కమ్యూనిస్టు పార్టీ రాకపోయినా  భగత్ సింగ్ ను ప్రారంభ మార్చిస్టుగా  చరిత్రకారుడు కే ఎన్ ఫణిక్కర్  ప్రకటించిన విధానాన్ని బట్టి  సామాజిక వ్యవస్థ , రాజకీయ యంత్రాంగం , పాలన వైఫల్యాలపై  పోరాటంలో  ఆయన అభిప్రాయాలను స్పష్టంగా తెలుసుకో  వచ్చు.  హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ  వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన భగత్ సింగ్  ఆంగ్లేయుల పాలనను  వ్యతిరేకించి  పోరాటాలను చేపట్టిన  సభ్యులు కలిగిన కుటుంబంలో జన్మించిన కారణంగా  భగత్ సింగ్కు  స్వతంత్ర పోరాటం  బాగా నచ్చింది.  ఐరోపాలో సాగిన  విప్లవోద్యమాలు మారణకాండ గురించి  అధ్యయనం చేసిన భగత్   అరాచక వాదాలను అణచివేసి  సామ్యవాదాన్ని స్థాపించడం ద్వారా  నూతన ప్రజాస్వామిక విప్లవం పట్ల  ఆకర్షితుడై  అనేక విప్లవ సంస్థలలో చేరి  ఆంగ్లేయుల పాలనను  తుదముట్టించడానికి  అన్ని సంస్థలు  శక్తులతో కలిసి పోరాడిన  అనుభవం భగత్ సింగ్ కు ఉన్నది.  నాటి  పోరాటాన్ని అనచివేసి  భగత్ సింగ్ కు జైలు శిక్ష విధించగా  64 రోజులపాటు నిరాహార దీక్షను చేపట్టిన సందర్భంలో  అనేకమంది మద్దతును కూడా కట్టడమే కాకుండా  భారత్  బ్రిటన్ రాజకీయ ఖైదీలకు  వివక్షత లేకుండా సమాన  హక్కులు కల్పించాలని డిమాండ్ చేయడం  ఆయన పోరాట స్ఫూర్తికి నిదర్శనం గా భావించవచ్చు.  అణచివేత, వివక్షత,  సామ్రాజ్యవాదాన్ని  ఏ కోశానా అంగీకరించ లేదు భగత్.    ఆనాటి పరిస్థితుల స్ఫూర్తి, ప్రేరణ,  భగత్ సింగ్ ఆచరణ ద్వారా  స్వతంత్రం కోసం పోరాడేలా యువతను ప్రేరేపించగా  మరో రకంగా సమానత్వం అంతరాలు లేని వ్యవస్థ కోసం  సామ్యవాద భావజాలం  యువతలో  పెంపొందడానికి  భగత్ సింగ్  ఆలోచన  ఎంతో దోహద పడినట్లు చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు.
     సైమన్ కమిషన్  భారత పర్యటన సందర్భంగా  30 అక్టోబర్ 1928న  లాహోర్ను సందర్శించినప్పుడు  లాలా లజపతిరాయ్ నేతృత్వంలో అ హింసా    పద్ధతిలో నిరసన కార్యక్రమం జరిగింది . ఆ కార్యక్రమాన్ని  హింసాయుతంగా మార్చిన పోలీసులు దానికి కారణం లాలా లజపతిరాయ్ అని ఆయన చాతి  పైన లాఠీలతో   కొట్టి ఆయన చావుకు కారణం అయినారు.  ఈ సంఘటన కల్లారా చూసినటువంటి భగత్ సింగ్  పోలీస్ అధికారి స్కాట్ను  హతమార్చడానికి  రాజ్ గురు సుఖదేవ్ జైపాల్ తో  చేతులు కలిపినాడు.  కానీ పొరపాటున   స్కా ట్ కు బదులు డిఎస్పి జెపి సాండర్స్ ను  కాల్చడంతో  పొరపాటు గ్రహించినటువంటి భగత్ సింగ్  తన నేరాన్ని    ఒప్పు  కోవడంతోపాటు  లాహోర్కు పారిపోయి  తప్పించుకున్నాడు .
   విప్లవకార్ల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును  తీసుకువచ్చిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని  చట్టాన్ని వ్యతిరేకిస్తూ  దాన్ని ఆమోదించనున్న కేంద్ర శాసన సభ పై  బాంబు పేల్చడానికి వ్యూహరచన జరిగింది . భగత్ సింగ్  దత్తులు  8 ఏప్రిల్ 1929న  శాసనసభ పై బాంబు విసిరి  ఇంక్వి లాబ్    జిందాబాద్  అని అరుస్తూ  కరపత్రాలు విసిరి వేసినప్పటికీ ఎవ్వరూ కూడా  చనిపోలేదు . భగత్  దత్తులు తాము చేసిన   పనిని  అంగీకరిస్తూ లొంగిపోయినారు.  శాసనసభపై  బాంబ్    విచారణ సందర్భంగా  భగత్ సింగ్ రాజగురు సుఖదేవులపై  నేరాలు మోపడం జరిగింది  హత్య నేరాన్ని అంగీకరించిన తాను  అవకాశాన్ని వినియోగించుకొని న్యాయస్థానంలోనే  వ్యతిరేకంగా ప్రకటనలు చేయడంతో   భగత్ సింగ్ ను ఒంటరి వాడిని చేసి   ఉక్కు పాదం మోపారు. 31 మార్చి1923వ తేదీన  భగత్ సింగ్ తో పాటు రాజగురు,  సుఖదేవులను లాహోర్  జైల్లో ఉరి తీసినప్పుడు   ఇంక్వి లాబ్   జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించినట్లు  అదే భగత్ సింగ్ జీవితానికి చివరి  సంకేతంగా  భావించినారు.
  డైరీ రాసే అలవాటున్న భగత్   జైల్లోనే 404 పేజీలను నింపి  తాను నమ్మిన  విప్లవకారులు చరిత్రకారుల పేర్లను ప్రస్తావిస్తూ  కార్లు మార్క్స్,  ఎంగిల్స్  ఆలోచనలను తన డైరీలో ప్రస్తావించినట్లుగా తెలుస్తున్నది.
  సహజంగా హేతువాది అయిన భగత్ సింగ్  తన చర్యల ద్వారా దేవుడి పైన విశ్వాసం లేని అహంకారి అని అందరితో అనిపించుకున్నప్పటికీ  మరణానికి ముందు కూడా" నేను ఎందుకు నాస్తికుడినయ్యాను" అనే శీర్షికతో  ఒక వ్యాసాన్ని రాసినట్టు తెలుస్తున్నది.  అంటే  తను   కలిగి ఉన్న అభిప్రాయాలు,  తనను ప్రభావితం చేసిన చరిత్రకారుల ఆలోచనలు  తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ధి నాయని  అలాగే మనం  నమ్మిన  గొప్ప వారి ఆలోచనలను పుణికి  పుచ్చుకోవడం ద్వారా  మనకంటూ నిర్మించుకునే ఒక చరిత్రలో  కొత్తదనాన్ని చాటి చెప్పవలసిన అవసరం ఉన్నదని  భగత్ సింగ్ చివరి జీవితం ద్వారా మనం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది. సట్లెజ్   ఒడ్డున ఉన్న  భగత్ సింగ్ స్మారక స్తూపం ఇప్పటికీ  స్వాతంత్ర పోరాటంలో అమరులైనటువంటి  వీరులను  గుర్తుకు చేస్తుందని  ఆ స్థూపాన్ని సందర్శించినటువంటి  ఎందరో  అభిప్రాయాలను బట్టి తెలుస్తుంది.  వీలైన ప్రతి చోట నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి  ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని  భగత్ సింగ్ జీవితం ద్వారా  మనం 
ఒక నిర్ణయానికి రావలసి ఉన్నది. 
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333