రైతులకు జీవనఆధారం లక్నవరం చెరువు
తెలంగాణ వార్త ములుగు స్టాఫ్ రిపోర్టర్
ఏప్రిల్ 26 /2024:-- గోవిందా రావుపేట మండలం లోని లక్నవరం చెరువు ను పరిశీలించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు జీవనాధారం అయిన లక్నవరం చెరువు కు త్వరలోనే గోదావరి జలాలు అందించి రెండు పంటలకు నీళ్లు అందిస్తామని ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండటం తో అనేక చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో ఎండిపోవడం తో రైతులు నా దృష్టికి తీసుకువచ్చారు అని త్వరలోనే రామప్ప రిజర్వాయర్ నుంచి కాశిందేవి పేట మిదిగా కేనాయిల్ ద్వారా లక్నవరం చెరువు కు నీటిని మళ్లించి గోవిందా రావుపేట మండలాన్ని శాస్యశమలం చేస్తామని రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.
గత ప్రభుత్వం నిర్లక్షం మూలాన కెనాయిల్ పనులు జరగక ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్నా పరిస్థితి ఉందని త్వరలోనే కెనాయిల్ పనులు పూర్తి చేపించి రైతులకు సాగు నీరు అందించే విధంగా చొరువ చూపిస్తానని మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు అన్నారు