ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో మీకు తెలుసా?

Oct 6, 2024 - 15:25
Oct 6, 2024 - 15:29
 0  6
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందో మీకు తెలుసా?

అడ్డగూడూరు 05 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.రేషన్ షాప్ కు వెళ్లి ఈ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? అనే వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది.ప్రభుత్వ నుండి పొందే అన్ని రకాల స్కీములు, ఆర్టీసీ బస్సుల్లో పదే పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చని ప్రభుత్వా అధికారులు చెబుతున్నారు. ఇది ఒకందుకు సామాన్య ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉంటుందని ప్రజలు యోషిస్తున్నారు. ముఖ్యంగా బీద సామాన్య ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని ప్రజలు అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో అవుక తోకలు జరగకుండా సామాన్యు ప్రజలు అనుకుంటున్నా మాట.. ప్రభుత్వాన్ని ఇంకో మాట ప్రజలు అనుకుంటున్న మాట ఒక ఇంట్లో 4,5మంది ఉంటే అది అందరికీ ఒకటే ఉంటే ఎక్కడన్నా వెళ్ళవలసిన పని ఉంటే అది ఒక్కరికి మాత్రమే యూస్ అవుతుందని ఇంక నలుగురు ఎలా యూస్ చేసుకోవాలని ప్రశ్నగా మారనుంది. ఇంట్లో ఉన్న నలుగురు ఒకే రూట్లో వెళ్లలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద వెళ్లవలసి వస్తుంది. అప్పుడు డీజిల్ కార్డు ఎలా వాడుకోవాలని ప్రశ్నగా మీగలనుంది.