రేషన్ కార్డులను పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్

తిరుమలగిరి 20 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన రేషన్ కార్డులను శనివారం నాడు తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో నూతన రేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 14న తిరుమలగిరి మండల పట్టణ మున్సిపల్ కేంద్రంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఆధ్వర్యంలో ప్రారంభించారని అని చెప్పారు . గతంలో ఏ ప్రభుత్వం మంజూరు చేయు విధంగా తమ ప్రభుత్వం రేషన్ కార్డుల తో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ షేక్ జాన్ మమ్మద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సోజు నరేష్ , తుంగతుర్తి నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆఫీజ్ , మోహన్, రేషన్ డీలర్ రాములు తో పాటు రేషన్ కార్డు లబ్ధిదారులు పలువురు పాల్గొన్నారు......