తల్లి దండ్రులు కోల్పోయిన పిల్లలకి 155000. అర్ధిక సహాయం

Jul 20, 2025 - 16:11
 0  5
తల్లి దండ్రులు కోల్పోయిన పిల్లలకి 155000. అర్ధిక సహాయం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ తల్లి దండ్రులు కోల్పోయిన పిల్లలకి 155000. అర్ధిక సహాయం ఆత్మకూరు ఎస్... మండల పరిధిలోని గట్టికల్ గ్రామం లో గత రెండు వారాల క్రితం తల్లీ మోరపాక లక్ష్మి , తండ్రీ, మోరపాక రాములు, తాత బిక్షం ను ఒకే సారి కోల్పోయి అనాధ లు అయిన మొరపాక శివ 9 సంవత్సరాలు, మొరపాక సాయి 4 సంవత్సరాలుగల ఇద్దరు పిల్లలకు ఆదివారం , హైద్రాబాద్ కు చెందిన హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా 1,55,000 రూపాయలు అందజేశారు.రాష్ట్ర విద్యుత్ సంస్థ లో పనిచేస్తున్న GM & అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య , పోలీస్ డిపార్టుమెంటు లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ లు చెరుకు నాగరాజు, లింగయ్య,రాజు ,మహారాజ్, లు తమ హెల్పింగ్ హాండ్స్ సంస్థ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందజేసినట్లు అంజయ్య తెలిపారు . అదేవిధంగా ఈ పిల్లల బాగోగులకోసం తర్వాత కాలంలో కూడా అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు.చిన్న బాబు సాయి చదువులకు అయ్యే ఖర్చు 1నుంచి10 వ తరగతి వరకు అయ్యే పూర్తి ఖర్చు ఒకటే సారి స్కూల్ లో కట్టేస్తామని హామీ ఇచ్చారు. అనాథ పిల్లలకు ఆసరా నిలిచి అందరిచే సహాయ సహకారాలు అందజేసెలా చేయూత నిస్తూ వారి బాగోగులు చూస్తున్న ఇదే గ్రామానికి చెందిన రాచకొండ రమేష్ హేమలత దంపతులను, అనాథ పిల్లలకు సహకారం అందిస్తున్న దాతల కు మరియు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. అక్కడి కి వచ్చిన గ్రామస్తులు హెల్పింగ్ హ్యాండ్ సభ్యుల కు దాతల కు కృతజ్ఞతలు తెలిపారు.