ఎమ్మెల్యే సామెల్ కు సవాల్ విసిరిన పోతరాజు రజిని
తిరుమలగిరి 20 మార్చి 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- మా జీవితం తెరిచిన పుస్తకం. మూడు తరాల విద్యావంతుల కుటుంబము. నేను అవినీతికి పాల్పడినట్లు మీరు నిరూపిస్తే ఉరి కొయ్యకు వేలాడతాను . అధికార పార్టీ లో తుంగతుర్తి శాసనసభ్యులు తిరుమలగిరి పైలెట్ ప్రాజెక్టు దళిత బందులో అవినీతిని వెలికితీయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి సిట్ విచారణ జరిపించాలి . తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ధాన్యం కుంభకోణం .ఇసుక కుంభకోణం .భూములు ఆక్రమణలు.దళిత బందు ప్రాజెక్టు. మున్సిపాలిటీలో లో ఇచ్చిన అక్రమ పర్మిషన్స్ అక్రమ వెంచర్స్. మున్సిపాలిటీ లో దళిత బందులో జరిగిన అవినీతిపై పాత కమిషనర్‌ను విచారణకు ఆదేశించాలీ . దళారులను వెతకాలి . నిజంగా నా తరపున ఎవరైనా తప్పు చేస్తే తల తాకట్టు పెట్టి ఐనా , ఎ శిక్ష వేసిన భరిస్తా. ప్రజా సేవకు ఎన్నో లక్షలు కర్చు పెట్టినాము .ఆస్తులు కోల్పోయాము . నేను ఆస్తుల కోసం ఎవరిని, ఏ వ్యాపారస్తులను బెదిరించలేదు . కాంట్రాక్టర్స్ ను డబ్బుల కోసం పిలవలేదు . ప్లాట్ బహుమతిగా తీసుకోలేదు. దౌర్జన్యం చేయలేదు. ఎవరి ఆస్తులు ఆక్రమించలేదు. కోర్టు వివాదంలో తల దూర్చలేదు. పదవి కోసం పార్టీ మారలేదు . ఎన్ని అవమానము ఎదురైన బిఆర్ఎస్ పార్టీ కోసం పని చేశాం. ప్రతిపక్ష పార్టీలు కలుపుకుని పోయాము. నా గురించి ప్రచారం చేయడానికి వందమంది, లేరు. మీరు నాపై కేసులు పెట్టి విచారణ చేయవచ్చు. నేను ఉండేది హైదరాబాద్. నేను కొత్తగా ఎన్నిక కాగానే ఏ డబ్బుల కోసం మున్సిపల్ కాంట్రాక్టర్స్ ను పిలవలేదు . ఏ వ్యాపారస్థుడు దగ్గర డబ్బులు లంచం తీసుకోలేదు. ఏ వ్యాపారస్తులు దగ్గర కార్ బహుమతిగా తీసుకోలేదు. ఇసుక కాంట్రాక్టర్ దగ్గర రాబోయే టెండర్స్ కోసం ముందస్తు డబ్బులు తీసుకోలేదు.నేను కౌన్సిలర్ గా మళ్లీ గెలవలెను అని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, తుంగతుర్తి బరిలో మీరు, నేను స్వతంత్ర అభ్యర్థులుగా తేల్చుకుందము . అని సవాల్ విసిరిన పోతరాజు రజిని రాజశేఖర్ మున్సిపల్ మున్సిపాలిటీ చైర్మన్