అడ్డగూడూరులో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి
బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించాలి!
30 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన నాయకులకు, కార్యకర్తలకు అండగా నేనుంటా!6
అడ్డగూడూరు 19 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మరియు ఎసిసి నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అగ్ర నేత రాహుల్ గాంధీకీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.30 ఏళ్లుగా పార్టీ జెండాని మోస్తూ నికార్సేన కాంగ్రెస్ శ్రేణుల శ్రమ ఫలితమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అదేవిధంగా జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కైవసం చేసుకోవడం అన్నారు. ఇంటి ఉత్సాహంతో పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా కబురందిస్తే ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం అడ్డగూడూరు పట్టణ కేంద్రానికి చెందిన ఎంపీటీసీ గూడెపు (పెండేల) భారతమ్మ భర్త, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెపు పాండు నాన్న ఎల్లయ్య ఇటీవల మృతి చెందగా ఎల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు కప్పల రాజేష్ వాళ్ళ నాన్న రాములు దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందజేశారు. లక్ష్మీదేవికాల్వ గ్రామానికి చెందిన ఆకుల వెంకన్న ఇటీవల మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నర్సయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ వళ్లంభట్ల పూర్ణచందర్ రావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య గౌడ్, వంగాల సత్యనారాయణ, పూలపల్లి సోమిరెడ్డి, నాగులపల్లి రమేష్, వళ్లంభట్ల రవి, కన్నెబోయిన గంగరాజు, కడారి రమేష్, పనుమటి దుర్గ, పాటి సభిత రాంకుమార్ రెడ్డి, బాలెంల రమేష్, బాలరాజు, మేడబోయిన శ్రీను, అలువాల శంకర్, బాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు గూడెపు నాగరాజు మారిశెట్టి మల్లేష్, రాజశేఖర్ రెడ్డి, నవీన్, ఎండి షకీల్, మందుల సోమన్న పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.