ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరణ ఎస్పీ

Apr 8, 2024 - 19:46
Apr 8, 2024 - 19:46
 0  21
ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరణ ఎస్పీ

జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి  కార్యక్రమం ను ఈ రోజు జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS .  జిల్లా పోలీస్ కార్యాలయం లో నిర్వహించారు.  

 జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 7 మంది బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ  స్వీకరించిన  జిల్లా ఎస్పి  బాధితుల సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులలో అస్తి పంపకాలు చేయనందున కొడుకులు బయ బ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఒక పిర్యాదు, పొలం బాటకు సంబందించి ఒక పిర్యాదు, అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనీ ఒక పిర్యాదు, ప్రేమ పెళ్లి చేసుకున్న తమకు పోలీస్ భద్రతా కావాలని ఒక పిర్యాదు, భార్య భర్తల మధ్య గొడవకు సంబందించి  ఒక పిర్యాదు మరియు ఇతర అంశాలకు సంబంధించిన   సమస్యలపై వచ్చిన  బాధితుల ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించారు. ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత  ఎస్సై లను, సీ.ఐ లను జిల్లా ఎస్పీ  ఆదేశించారు. కుటుంబ తగాదాలకు సంబందించి వెంటనే కౌన్సిలింగ్ నిర్వహించాలని మరియు సివిల్ వివాదాలను కోర్టు లలో పరిష్కరించుకునేల బాధితులకు తెలియజేయాలని  జిల్లా ఎస్పీ  పోలీస్ అధికారులను ఆదేశించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333