మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన
BRS పార్టీ మండల అధ్యక్షుడు గంప రాంబాబు
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన BRS పార్టీ మండల అధ్యక్షుడు గంప రాంబాబు
వెంకటాపురం డిసెంబర్ 26 తెలంగాణ వార్త:- వెంకటాపురం మండలంలోని ఆలు పాక భోదపురం, పంచాయతీల పరిధిలో ఇటీవల అకాలంగా మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన BRS పార్టీ మండల అధ్యక్షుడు గంప రాంబాబు , భోదాపురం పంచాయతీలోని ఇటీవల వాళ్ళ కాలంలో బాడిస ప్రసాద్ , అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగినది, ప్రసాద్ భార్యకి నవనీతకు, ఆర్థిక సాయం చేయడం జరిగినది, అదేవిధంగా భోదపురంలోని గట్టుపల్లి మూగరాజు అనారోగ్యంతో మరణించడం జరిగినది, మృగరాజు భార్యకి గట్టుపల్లి, ధనలక్ష్మి, కి మరియు ఆలుబాక పంచాయతీ పరిధిలోని తానిపర్తి గ్రామానికి చెందిన దుర్గం సోమరాజు, పాము కాటుకు మరణించినాడు, సోమరాజు భార్య మాధవికి ఆర్థిక సాయం చేయడం జరిగినది,, రాంబాబు ఈ కుటుంబాలలో కలిపి సుమారు 25000 ఆర్థిక సాయం చేయడం జరిగినది, ఆర్థిక సాయంతో పాటు వాళ్ల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు అన్ని లబ్ధి పొందే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు, ఈ కార్యక్రమంలో BRS పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు Sk ముస్తఫా, మాజీ,సర్పంచులు p ఆదిలక్ష్మి, సోడి రాధా, మాజీ ఉప సర్పంచ్ B సమ్మక్క, పార్టీ సీనియర్ నాయకులు, శంకర చంటి, B సమ్మయ్య, p రాజు, తెల్ల ఆనంద్ కుమార్, కన్నారావు, శ్యామల రమేష్, p సమ్మయ్య, తాటి నాగేంద్ర, టి బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు