కోదాడలో వకీల్ సాబ్ సూపర్ ఉమెన్ సరళ, శాస్త్రల సందడి.

తెలంగాణ వార్త ప్రతినిధి:- కోదాడలో వకీల్ సాబ్ సూపర్ వుమెన్ సరళ, సహస్ర ల సందడి...కోదాడలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఫ్రేమ్ సూపర్ వుమెన్ సరళ, పద్మావతి కళ్యాణం ఫేమ్ సహస్ర లు బుధవారం రాత్రి కోదాడలో సందడి చేశారు. దీంతో కోదాడలో సందడి వాతావరణం ఏర్పడింది. వివరాలకు వెళ్తే కోదాడ పట్టణంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులు రావెళ్ళ కృష్ణారావు మాలతీ ల పుత్రిక సాయి శ్రీ - సందీపుల వివాహానికి అతిధులుగా హాజరయ్యారు. వివాహ సమయంలో బంధుమిత్రులు, పద్మావతి కళ్యాణం సీరియల్ అభిమానులు సినీ తారలతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా సహస్ర, సూపర్ వుమెన్ సరళ లు మాట్లాడుతూ కోదాడ పట్టణానికి వచ్చి మా అభిమాన మహిళలను కలవడం ఎంతో ఆనందంగా ఉందని, కోదాడ ప్రాంతానికి సినీ లోకానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉన్నదని ప్రముఖ హాస్య నటుడు దివంగత వేణుమాధవ్, గురు సమానులు కత్తి కాంతారావు ( గుడిబండ కాంతారావు) జన్మించిన ప్రాంతం కావడం తో వారిని స్మరించుకున్నట్లు తెలిపారు. ఈ వివాహానికి మరో ముఖ్య అతిథి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కొండపల్లి జ్యోతిర్మయి అన్నమాచార్య కీర్తనలతో అలరించారు. సినీ తారలతో పాటు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, టి పి సి సి ప్రతినిధి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ముత్తినేని సైదయ్య , డాక్టర్ జాస్తి సుబ్బారావు, జర్నలి సంఘ రాష్ట్ర నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, బిజెపి నాయకులు నూనె సులోచన కనగాల నారాయణ, బొలిశెట్టి కృష్ణయ్య, కౌన్సిలర్ బతినేని హనుమంతరావు, షఫీ, గంధం యాదగిరి, లంకెల రమ నిరంజన్ రెడ్డి, పెండెం వెంకటేశ్వర్లు, కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.