పేటలో మహానగరాలకు దీటుగా దక్షిత కార్ కేర్

దక్షిత కార్ కేర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మహా నగరాలకు దీటుగా, అత్యాధునిక టెక్నాలజీతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన దక్షిత కార్ కేర్ సేవలను పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తండు గోపి కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగం క్రాస్ రోడ్ లో హైదరాబాద్ సర్వీస్ రోడ్డు వెంట నూతనంగా ఏర్పాటు చేసిన దక్షిత కార్ కేర్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మీ అమూల్యమైన కార్లకు సూర్య రష్మీ, వాతావరణం లో మార్పులు, వాహనాల కాలుష్యం, పక్షుల రెట్ట వేయడం, పార్కింగ్ చేసిన సమయంలో ఆకులు పూలు పడడంతో ఏర్పడే మరకలను తాము సునాయాసంగా తొలగిస్తామన్నారు. మా దక్షిత కార్ కేర్ లో సైరామిక్ అండ్ పిపిఎఫ్, టేఫ్రాన్ కోటింగ్, నానో కోటింగ్ వాషింగ్ అందుబాటులో ఉన్నాయన్నారు. తాము ఇప్పటికే మా సేవలను హుజూర్నగర్ లో అందిస్తున్నామని సూర్యాపేట పట్టణ ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఇక్కడ దక్షిత కార్ కేర్ ను ప్రారంభించినట్లు తెలిపారు. కారు యజమానులు, డ్రైవర్లు, మెకానిక్ లు మా దక్షిత కార్ కేర్ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తండు ఉమారాణి, దక్షిత, రిషల్ తదితరులు ఉన్నారు.