భారీ వర్షాలతో మత్తడి దూకుతున్న చెరువులు

తిరుమలగిరి 02 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలగిరి మండలం లోని పలు గ్రామాల్లోని చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా చెరువులు, కుంటలు నిండు కుండలా తలపిస్తున్నాయి.గుండెపురి, మాలిపురం గ్రామాల్లోని చెరువులు మత్తడి అలుగులు పోస్తున్నాయి.తొండ లోని ముత్యాలమ్మ చెరువు వద్ద గ్రామస్తులు చేపల వేటలో నిమగ్నమయ్యారు.